స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు.
ముందుగా స్మార్ట్ ఫోన్ అనగానే గుర్తొచ్చేది బ్యాటరీ కెపాసిటీ.అలాగే స్మార్ట్ఫోన్లు ఉన్న చాలా మంది బయపడేది ఒక్క బ్యాటరీ కోసమే.
అంటే కొన్ని సార్లు బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అనేది అవుతుంది.
అలాగే కొన్ని సార్లు ఓవర్ హీట్ వల్ల ఫోనే కాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఓవర్ హీట్ కు కారణం ఏమిటంటే ఒకొక్కసారి ఫోన్ కి స్పీడ్ గా చార్జింగ్ ఎక్కే ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెడతారు.
దానివల్ల ఆ బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవుతుంది.
ఎందుకంటే ఆ ఫోన్ డిజైన్ లో కొంచెం మెల్లగా ఛార్జింగ్ ఎక్కే ఛార్జర్ కే సపోర్ట్ చేస్తుంది.
అలాగే వేసవి కాలంలో చాలా వేడిగా ఉంటుంది.దానితో అప్పటిదాకా వాడిన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వలన ఆ ఉష్ణోగ్రతల మూలంగా ఆ బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవుతుంది.
కొన్నికొన్ని సార్లు బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
అలాగే మరో కారణం ఎక్కువ పరిమాణంలో ఉన్న పౌచ్ లను ఫోన్లకి పెట్టడం ద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు.కొంత మొత్తంలో హీట్ అనేది విడుదలవుతుంది.
ఆ హీట్ ని బయటకు పోకుండా ఈ పౌచ్ లు అడ్డుకుంటాయి.దీనిములంగా ఓవర్ హీట్ అయ్యి బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది.