నెహ్రూ జ్యూలాజికల్ పార్క్ ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలి…?
నెహ్రూ జ్యూలాజికల్ పార్క్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూపార్క్ లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో తెలంగాణలోని జూ లు, పార్కుల తీరుతెన్నులను సమీక్షించారు. జూ పార్క్ ను దేశంలోనే టాప్‌లో నిలిపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని నెహ్రూ జ్యూలాజికల్ పార్కుతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జూ పార్కుల్లో సందర్శకులకోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జూపార్కుల్లో భద్రత చర్యలు, నెహ్రూ జూపార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు, ఆన్లైన్ టికెటింగ్, సందర్శకులకు అన్ని వసతుల తో ఫుడ్‌కోర్టు,తదితర ఏర్పాట్లపై అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, జూ పార్కుల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బర్, ఒఎస్‌డి శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, బోర్డు సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జూ పార్కు అదనపు ఆకర్షణలతో మరింతగా అలరించనుందని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నగరంలోని జంతుప్రదర్శనశాల సందర్శకులను కనువిందు చేయడానికి అనేక హంగులను సమకూరుస్తున్నట్లు చెప్పారు. జంతు ప్రదర్శనశాలలో ఆఫ్రికన్ సింహం,దాని రెండు కూనలు, ఆస్ట్రిచ్ పక్షులు, డక్ ఫాండ్ వాక్ త్రూ ఏవియరీ, స్టార్క్ ఎన్ క్లోజర్స్ ను సందర్శకుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. సోమవారం నెహ్రూ జ్యూలాజికల్ పార్క్ లో ఆఫ్రికన్ సింహం,దాని రెండు కూనలు, ఆస్ట్రిచ్ పక్షులు, స్టార్క్ ఎన్ క్లోజర్స్, డక్ ఫాండ్ వాక్ త్రూ ఇవరీలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పక్షుల సందర్శన కేంద్రానికి ఇవి అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. పలు రకాల పక్షులను సమీపం నుంచి వీక్షించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, జూ పార్కుల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బర్, ఒఎస్‌డి శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్ మురాత్కర్ ను సన్మానించిన మంత్రి అల్లోల*
మహారాష్ట్రలోని అమరావతి యూనివర్సిటీకి చెందిన గడ్డి శాస్త్ర పరిశోశకుడు డాక్టర్ మురాత్కర్ ను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించారు. సొమవారం నెహ్రూ జ్యూలాజికల్ పార్క్ లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి అల్లోల, అటవీ శాఖ ఉన్నతాధికారులు డా.మురాత్కర్ ను సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… అడవుల్లో గడ్డి మొక్కలను కాపాడుకోవడంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై మురాత్కర్ తెలంగాణ అటవీ అధికారు అవగహన కల్పిస్తున్నారని, స్వచ్చంద ఆయనే ముందుకు వచ్చి శాస్త్రీయశిక్షణ ఇవ్వడం అభినందనీయం అన్నారు. మురాత్కర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అడవుల్లో గడ్డి మొక్కలను పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపడతుందని, హరితహారం చాలా మంచి కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, తదితరులు ఉన్నారు. మురాత్కర్ గడ్డి క్షేత్రాల నిర్వహణ ( grass land management expert ) నిపుణుడు. గత వారం రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కవ్వాల్, అమ్రాబాద్, ఏటూరునాగారం, కిన్నెరసాని ల్లో అటవీ భూముల ను పరిశీలించారు.అటవీ విత్తనాలు సేకరణ, నాటడంపై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.