ఆయనో బిచ్చగాడు.. రూ. 3 లక్షలు దానం చేశాడు..
ఆయనో బిచ్చగాడు.. అయితేనేం భిక్షాటనలో సంపాదించిన డబ్బును ఆలయాల అభివృద్ధికి విరాళాలుగా అందజేస్తూ దానగుణ సంపన్నుడనిపించుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబోలు కామరాజు 60 ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా చీపురుపల్లి వచ్చి అక్కడే ఉండిపోయాడు. కొన్నేళ్ల కిందట తన రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో ఏ దిక్కూ లేక తప్పని పరిస్థితుల్లో స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో యాచకం చేస్తూ జీవితం గడిపేస్తున్నాడు. ఈయన ఇదివరకే భిక్షాటనలో కూడబెట్టిన రూ.3.05 లక్షలు గత రెండేళ్లలో విడతల వారీగా నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి దానమిచ్చాడు.తాజాగా పట్టణ శివారున రావివలన కూడలి సమీపంలోని భారీ ఆంజేయస్వామి విగ్రహం వద్ద ..భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి రూ.30వేలు అందజేశాడు.