చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు రద్దు, కొత్త పేర్లు

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్లు పెంచారు, జీతాలు హైక్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పథకాలు తొలగింపుతో పాటు పేర్లు మార్చాలని చూస్తున్నారు. దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పథకాల పేర్లను ప్రభుత్వం మార్చనుంది. పథకాలకు కొత్త పేర్లు పెట్టనున్నారు. బుధవారం (జూన్ 12,2019) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుది. ఈ సమావేశంలో ఏయే పథకాలు తొలగించాలి, పేర్లు మార్చాలి, కొత్తగా ఏం పేర్లు పెట్టాలి అనే దానిపై చర్చిస్తారు.
గత ప్రభుత్వ పథకాల్లో వేటిని కొనసాగించాలి.. ఏవి తొలగించాలి.. వేటికి పేర్లు మార్చాలి అనే అంశంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సచివాలయంలో అన్ని శాఖల సెక్రటరీలు, శాఖాధిపతులతో సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు కొత్త పథకాలను బడ్జెట్‌లో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త పథకాలకు బడ్జెట్‌లో చోటు కల్పించాలంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్నింటిని తొలగించాలని, మరికొన్నిటికి పేర్లు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు ఆయా పథకాలకు సంబంధించి పూర్తి సమాచారంతో ఈ సమావేశానికి హాజరుకానున్నారు. యువనేస్తం, పసుపు-కుంకుమ పథకాలను పూర్తిగా రద్దు చేయనున్నారు. చంద్రన్న పేరుతో ఉన్న అన్ని పథకాల పేర్లను మార్చనున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరును రైతు భరోసాగా, ఎన్టీఆర్‌ వైద్యసేవను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా మార్చిన సంగతి తెలిసిందే

About The Author