హలో బ్రదర్ – హలో సిస్టర్..

హలో బ్రదర్ సినిమాలో – ఒక బ్రదర్ ఏమిచేస్తే – ఆ చుట్టుపక్కలే వున్నా ఇంకో బ్రదర్ అదేచేస్తాడు . ఆ బ్రదర్స్ వేరువేరు గా పెరిగి నా , కవల పిల్లలాగా ఒకే తల్లికి పుట్టటం వల్ల ఒకరేమిచేస్తే , రొండో వారు అదేచేస్తారు . అది మనకు మజా కలిగించింది . ఒకే ఆత్మ వన్ బై టూ ( టీ ) లాగా తయారయ్యి ,
కవలలుగా పుట్టిన ఇద్దరిలో సగం సగం గా ఉండక పోతే , కవలలు గా పుట్టిన పిల్లలు – ఒకరేమిచేస్తే , రొండో వారు అదే చేస్తారు అనే పాయింట్ కి లాజిక్ దొరకదు . నిప్పులేనిదే పొగ రాదు . ఒక ఆత్మ రొండు సగాలు అవ్వటం అన్నదాంట్లో 1% అన్నా నిజం వుండకపోదు .

హలో బ్రదర్ story – ఇద్దరు బ్రదర్స్ బ్రతికి వున్న సంగతి .

బ్రదర్స్ లో ఒకరు చిన్నప్పుడే చనిపోయి – ఇంకొకరు బ్రతికి మామూలుగా తిరుగు తూ ఉంటే ఆ సంగతి ఏమిటి ?

చచ్చి పోయిన బ్రదర్ కున్న సగం ఆత్మ ఏమిచేస్తుంది ? లోజిక్ ప్రకారం – ఇద్దరి ఆత్మలు 1/2 కదా ? రొండో సగం కోసం, మొదటి సగం ఆత్మ ఏమి చేస్తుంది. ? రొండో దేహం కూడా నశించే దాకా ఎదురు చూస్తుందా ? ఎదురు చూడక తప్పదా ? . మొదటి గా చనిపోయిన దేహంలోని సగం ఆత్మా – నువ్వు కూడా చనిపో అని రొండో సగాన్ని బలవంత పెడుతుందా ? లేక – నువ్వు హాయిగా వుండు – నేను నీకోసం వేచి వుంటాను – అని దీవిస్తుందా ? అప్పుడు కథ ఎలా ఉంటుంది ?

రొండు దేహాలలో వున్నఆత్మ ఒకటే కాబట్టి – అవి ఫ్రెండ్స్. అందువల్ల రొండో సగాన్ని ఏమీ బలవంత పెట్టక – హాయిగా బ్రతుకు .. కావా లంటే నేను నీకు హెల్పు చేస్తాను అంటుంది. అలా అంటేనే బ్రతికి వున్నా వాడి ప్రాణం సుఖంగా ఉంటుంది .

కవలల్లో ఒకరు చనిపోయిన తరువాత , వారి అత్మ రొండోవారి రూపాన్ని ధరించి – కొన్ని పనులు చక్క పెడుతున్నప్పుడు – ఆ అత్మ ని doppelganger అంటారు..
ఆ లాంటి మాట ఉన్నదంటే – ఆ మాటలో ఎంతో కొంత నిజం ఉండక పోదు .

Emilie Sagee – అనే టీచర్ గారు వుంది . కష్టమైన ఫారాలను – అరిటి పండు వలచి చేతిలో పెట్టినట్టు కాకుండా -జ్యూస్ చేసి – చేతిలో పెట్టేది . ఈమెనుి పెద్ద పెద్ద స్కూళ్లలో పెద్ద పెద్ద జీతాలిచ్చిటీచర్గా పెట్టుకునేవారు . కానీ ఈమె ఏ స్కూల్ లోను ఎక్కువ రోజులు పనిచేసేది కాదు .
19 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 18 స్కూల్స్ మారింది . కారణం ఏంటి? అన్నదానికి ఒక ఉదాహరణ చెపితే చాలు .

ఒక సారి ఆమె ” పిల్లలు అల్లరి చేయకండి – తలనొప్పిగా వుంది – అలా స్కూల్ గార్డెన్లోకి వెళ్లి వస్తాను ” అని చెప్పి వెళ్లి పోయింది. పిల్లలు అల్లరితో క్లాస్ రూమ్ హోరెత్తి పోసాగింది . ఆమె తిరిగొచ్చి ” సైలెన్స్ ” అని గట్టిగా అరిచి కుర్చీలో కూల పడింది . కాసేపటి తరవాత పిల్లలు – తమ టీచర్ స్కూల్ గార్డెన్ లో తిరుగుతూ ఉండటం – అదే సమయం లో క్లాస్ రూమ్ లో కుర్చీ లోకూడా కూచొని ఉండటం చూసి – మన టీచర్ ఎదో ఫన్ చేస్తున్నది అనుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు . కుర్చీలో మెత్తటి మబ్బులా, టీచర్ తగిలింది . అది ఒక ఆత్మ అని పిల్లకి తెలీదు కదా ? దయ్యం అని అరుచుకుంటూ బయటకి పరిగెత్తారు . ఇలాంటివి ఎన్నో జరిగాయి . అన్ని సార్లు ఆమె వుద్యోగం పోయింది .
ఎమిలీ సాగే కి ఒక కవల చెల్లెలు వుంది . ఆమె చిన్న తనంలోనే చని పోయింది . అందుకని ఆమె ఆత్మ , అక్క రాకకోసం ఎదురు చూస్తూ , అక్కకు వీలైనంత హెల్పు చేద్దామన్న ఉద్దేశ్యం తో ఆమె చుట్టూ పక్కలే తిరుగుతూ ఉండేది .
ఇందాక చెల్లి ఏమి చేసింది ? ” అవతల అక్కకి తలనొప్పిగా వుంది . ఇటేమో పిల్లలు అల్లరి చేస్తున్నారు . అందువల్ల పిల్లలని సైలెన్స్ చేస్తే – అక్కకి తలనొప్పి తగ్గుతుంది , నావల్ల హెల్పు అవుతుంది ” అని మంచిగా అలోచించి – క్లాసు రూములోకి వచ్చింది .
written by Varanasi sree rama krishna
మన కథలలో , శివుడు ఒక బ్రాహ్మణ రూపంలో కనిపించి -భక్తులకు హెల్ప్ చేసిన కథలు చాలా వున్నవిగా ? కాకా పోతే ఇది ఆత్మ చేసిన హెల్పు . రొండింటినీ పోల్చుకో వచ్చు . .
ఒకరి అత్మ ఇంకొకరి రూపాన్ని ధరించి తిరిగి నపుడు – ఆ ఆత్మని ( దెప్పోలేంగేర్ ? ) అంటారు.

ఇంకొక్క రెండు నిమిషాల పాటు గందరగోళం కూడా అనుభవిద్దాం..
చెల్లి అక్కకు హెల్ప్ చేయబోయి , అక్క వుద్యోగం ఊడగొట్టింది . అక్కకు వుద్యోగం ఊడకొట్టించటం – అక్కకు హెల్ప్ఇ కాదని చెల్లికి తెలియదా ?

అక్కాయికి మంచి మంచి డ్రెస్సులు , జేవలరీ ( jewalary ) వుండాలని, అక్క లైఫ్ హై క్లాస్ గా గడపాలని చెల్లి కోరిక . అందుకని అక్క వుద్యోగం పోగానే — తానే ఒక అప్లికేషన్ తయారు చేసుకొని – ఇంకో పెద్ద స్కూల్ కెళ్ళి – ఇంటర్వ్యూ ఇచ్చి , ఎక్కువ జీతంతో అప్పోయింట్మెంట్ ఐవచ్చేది . అప్పోయింట్ మెంట్ లెటర్ అక్కకు పోస్టులో వచ్చేది . అక్క వెళ్లి చేరేది .

ఈ రకంగా చూస్తే , అక్కాయికి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడల్లా చెల్లి
( శివుడు హెల్పు చేద్దాం అనుకున్నప్పుడు బ్రాహ్మణుడిలా జనాలకు కనపడ్డట్లు ) స్కూలు పిల్లలకి కనపడేది . మర్నాడే పెద్ద జీతంతో ఇంకో వుద్యోగం ఇప్పించేది .. అట్లా కాదు అంటే .. అక్కకోసం మంచి వుద్యోగం సంపాదించి. ఒప్పోయింట్మెంట్ లెటర్ పోస్టులో వేయించినాక, వచ్చి స్కూల్ పిల్లలకు కనిపించేది అంటే కూడా బాగానే ఉంటుంది .

చాలామంది చెల్లిని చూసారు కానీ – అక్క మాత్రం చెల్లిని చూడలేదు .ఇది ప్రకృతి రూల్సుకి విరుధ్హం ….
__ PHOTO IS ONLY TO ILLUSTRATE IDENTICAL TWINS – NO WAY CONNECTED TO THE STORY — DONT MISUNDERSTAND———

About The Author