తెలంగాణాలో కొత్తగా 119 గురుకులాలు…


రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈ నెల 17న సం బంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, ఐదేండ్లలో ప్రభుత్వం 142 కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటుచేసిందని పేర్కొన్నారు. కొత్తగా 119 మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నదని, వీటిని కూడా కలుపుకొంటే మొత్తం గురుకుల సంఖ్య 280కి చేరుకోనున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.

రాష్ట్రంలోని అన్ని క్యాటగిరీల కింద మొత్తం రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 906 ఉండగా, అందులో 53 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం గురుకుల పాఠశాలల్లో 5,335 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తుండగా 91,680 మంది విద్యార్థులు చదువుతున్నారు.

About The Author