సిద్దిపేట జిల్లా కేంద్రం పాత ఎం సి హెచ్ ఆసుపత్రిలో సఖి సెంటర్ ప్రారంభం…

– సఖి తో స్వాంతన..
– బాలలకు రక్షణ కవచం బాల రక్షా భవన్ .
– అన్నార్తులు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలి, సిద్దిపేట సఖి సెంటర్ ఆదర్శంగా నిలవాలి.
– సఖి సెంటర్ పై మహిళలు విస్రృత ప్రచారం చేయండి.
– త్వరలోనే ₹50 లక్షలతో సఖి సెంటర్ శాశ్వత భవనం ఏర్పాటు.

సఖీ సెంటర్ తో అవసరం రాకూడదనే కోరుకోవాలని.. మన దురదృష్టవశాత్తు సమాజంలో అత్యాచారాలు, గృహ హింస, లైంగిక వేదింపులు అనే సమస్యలు అనేకమయ్యాని అన్నారు. మహిళలకు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఈ సెంటర్ ని వినియోగించుకోవచ్చు అని చెప్పారు ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన అనంతరం జిల్లాకో సఖీ కేంద్రాల ఏర్పాటుకు చేయాలని కోర్టు సూచించిందన్నారు.. మహిళల హక్కులను ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం ఆర్ పి పై ఉందని. ఈ సఖి కేంద్రం మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తుందని , అన్ని శాఖల అధికారులు అండగా ఉంటారన్నారు.. మహిళల గౌరవానికి భంగం లేని సౌకర్యం సఖి సెంటర్ తోనే సాధ్యం అని .అన్ని వసతులతో ఈ సెంటర్ ఏర్పాటు చేశామని ఇందులో భోజనం,ఖర్చులకు డబ్బులు, భద్రత ఇక్కడ లభ్యం అవుతాయని చెప్పారు.. మహిళ పొలిసులు అందుబాటులో ఉంటారని . ప్రతి నెల మహిళా సమావేశాల్లో స్వయం ఉపాధి తో పాటు సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.. సంస్థ కోనసాగింపు అవసరం. సఖీ లో పనిచేసేవారికి తల్లికి ఉన్నత ఓపిక ఉండాలని.. సరిగ్గా పనిచేయకుంటే ఖచ్చితంగా తొలగిస్తామన్నారు. బాలరక్ష భవన్ పుట్టిన వారు మొదలు 18 సంవత్సరాల వయసున్న ఆడ, మగ లకు స్వాంతన చేకూర్చటం జరుగుతుంది… లైంగిక వేధింపుల భాదితులకు అండగా బాల రక్ష భవన్ తోడ్పాటు ఉంటుంది అని .. 181 టోల్ ఫ్రీ నెంబర్, 08457 -229108 లకు ఫోన్ చేయాలి, బాల రక్ష భవన్ 1098 టోల్ ఫ్రీ ఉంటుంది. అన్నార్తులు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలి. సిద్దిపేట సఖి సెంటర్ ఆదర్శంగా ఉండాలి, ₹ 50 లక్షలతో శాశ్వత భవనం నిర్మిస్తమని చెప్పారు ఒంటరి మహిళల కోసం మహిళా ప్రాంగణం ,వర్కింగ్ వుమేన్స్ హాస్టల్ అవసరం, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించారు…

About The Author