హిందూ సంప్రదాయం అనుసరించే వారు, ఎవరు చెప్పినా పాటించవలసిందే…


సంప్రదాయం అనుసరించే వారు, ఎవరు చెప్పినా పాటించవలసిందే…

_1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు._

_2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు._

_3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు._

_4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు._

_5) నూనె, ఉప్పు, చేతికి ఇవ్వరాదు._

_6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు._

_7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు._

_8) మంచం మీద కూర్చుని తినకూడదు._

_9) తలుపుల మీద బట్టలు వేయకూడదు._

_10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి. సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుందిట._

_11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి._

_12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు._

_13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు._

_14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి._

_15) తెల్లవారి లేవగానే దేవుని పటములు ముందు చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు._

_16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి._

_17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు._

_18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి._

_19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు._

_20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు._

_21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు._

_22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు._

_పాటించేవారుంటే.. ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు. చెప్పడం మన విధి. ఆ పైన వారి ఇష్టం._

?ఇది కదా మన సాంప్రదాయాలు

About The Author