అనుమానం పెనుభూతమై భార్య తల నరికి కడతేర్చిన భర్త…
తలతో సహా స్టేషన్ లో లొంగుబాటు-కలకడ
అనుమానం పెనుభూతమై భార్య తల నరికి తలతో సహా కలకడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సంఘటన మఙడలంలో చోటు చేసుకుంది.ఎస్ వంశీధర్ తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా సంబేపల్లి మండలం అసాంజివాండ్ల పల్లి(అసందుపల్లి) కి చెందిన నాగూరు హుసేన్ కుమారుడు నాగూరు హుసేనయ్యకు చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడు కాలనీకి చెందిన అమ్మాజీతో (27)తో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు కలరు.ఇదిలా ఉండగా డ్రైవర్గా పనిచేస్తున్న హుసేనయ్య భార్యపై వివాహేతర సంబంధం ఉందనే గత కొంతకాలంగా అనుమానంతో వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అమ్మాజి తన పుట్టినిల్లయిన మర్రిపాడు కాలనీకి ఇటీవల చేరుకుంది. మరింత కోపోద్రిక్తుడైన హుసేనయ్య భార్యను చంపాలని ముందుగానే పన్నాగం పన్ని కొడవలిని తన ద్విచక్ర వాహనంలో సిద్దం చేసుకుని అత్తగారిల్లు చేరుకుని ఇకపై తన భార్యను భాగా చూసుకుంటానని అత్తగారికి చెప్పి,భార్యకు మాయ మాటలు చెప్పి ఒప్పించాడు. అనంతరం భార్యను తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణంలో కలకడ మండలం నడిమిచెర్ల పంచాయతి సర్పకుంట వద్దకు రాగానే మరుగుదొడ్డికి వెల్లాలనే నెపంతో ద్విచక్ర వాహనాన్ని ఆపాడు.మరుగుదొడ్డికి వెల్లి వచ్చిన భార్యను అప్పటికే సిద్దంగా ఉంచిన కొడవలితో భార్య ను విచక్షణా రహితంగా తల నరికి అక్కడ నుంచి తలతో సహా కలకడ పోలీస్ స్టేషన్ వచ్చాడు.అతన్ని చూసిన పోలీసులకు ఏమి చేయాలో దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతసేపు తరువాత తేరుకుని నిందితుడిని సంఘటనా స్థలం కు తీసుకెళ్లి హత్యకు పాల్పడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.మదనపల్లి డియస్ పి చిధానంద రెడ్డి, వాల్మీకిపురం సిఐ ఉలసయ్య హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పియం కు తరలించి,డియస్ పి ఆధ్వర్యంలో కేసు నమోదు నిందితున్ని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వంశీధర్ తెలిపారు.