సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.

▫️మీ సేవలో నేను ఉంటా, సేవలో మీరు భాగస్వామ్యం అయినప్పుడే అభివృద్ధి సాధ్యం.
▫️ఐక్యతతో ఆదర్శగ్రామలుగా తీర్చిదిద్దుకుందాం.
▫️లక్షమొక్కలు నాటి ఆకుపచ్చ బుస్సా పూర్ గా చేసుకుందాం.
▫️మంచి సొసైటీ, మంచి గ్రామంగా మార్చడం లో యువత ముందుండాలి.
▫️యువత ఫోన్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి.
▫️దశల వారిగా గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తా.
▫️ గ్రామ యువత వారానికి ఒక గంట శ్రమదానం చేయాలి.
▫️ ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడావ్యవసాయం వైపు చూస్తున్నారు.

బుస్సాపూర్ గ్రామంలో ₹28లక్షల తో పంక్షన్ హాల్ కి శంకుస్థాపన చేసుకున్నాం. అద్బుతంగా స్మశాన వాటిక కూడా నిర్మించుకున్నాం. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి 4లక్షలు ముంజూరు చేసుకున్నాం. ₹60 లక్షలతో సిసి రోడ్ పనులు చేసుకున్నాం. వచ్చే దసరా నాటికి బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేస్తాము. ఈ గ్రామానికి 25 డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసాము. 12 లక్షల తో గౌడ సంఘం భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం, పనికూడా తొందరగా పూర్తి చేస్తాము. గ్రామంలో రెండు పురాతన హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి, ఒక హనుమాన్ దేవాలయానికి 3లక్షలతో పూర్తి చేసుకున్నాం, మరో హనుమాన్ దేవాలయానికి 25 లక్షలు మంజూరు చేస్తాము. గుడికందుల వెళ్లే రోడ్ కూడా మంజూరు చేస్తానని దశల వారిగా ఒక్కకోటి అభివృద్ధి చేసుకుందాం.

About The Author