సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వైఎస్ జగన్…


‘స్పందన’ కార్యక్రమంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు ఎవ్వరు కూడా స్పందన కార్యక్రమాన్ని మిస్‌ కావొద్దు, వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి, ప్రతి రశీదుమీద కూడా తేదీ ఉండాలని సీఎం పేర్కొన్నారు. వినతుల పరిష్కారంలో లోపాలను వీడియో కాన్ఫరెన్స్‌ లో ప్రస్తావించిన సీఎం.
కలెక్టర్లు, అధికారులు మనసుపెట్టి పనిచేయాలి ప్రజల వినతులను పరిష్కరించాలని తెలిపారు. రశీదులో టైంలైన్స్‌ ఇవ్వాలి, టైంలైన్స్‌ ను తప్పనిసరిగా ఫాలో కావాలి, మొదటి స్పందన కార్యక్రమం ద్వారా 4,400కుపైగా వినతులు వచ్చాయి, వీటిని 1–7 రోజుల్లో పూర్తిచేస్తామని చెప్పాం, దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ముఖ్యమంత్రి పేర్కొనారు. పెన్షన్లు, హౌసింగ్, రేషన్‌కార్డుల మీద వినతులు ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యమంత్రికి చెప్పిన అధికారులు. దీని పరిష్కారానికి గ్రామసచివాలయాలను డైనమిక్‌గా వాడతాం, రేషన్‌కార్డు, పెన్షన్‌ ఏం అడిగినా 72 గంటల్లోగా పరిష్కరించమని చెప్తున్నాం, స్కానర్, ప్రింటర్, కంప్యూటర్, లామినేటెడ్‌ యంత్రం కూడా గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్‌కార్డు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం, దీనిపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం, ప్రతి జాబితా కూడా గ్రామ సచివాలయంలో ఉంచుతాం, దీనివల్ల కంటిన్యూగా సోషల్‌ ఆడిట్‌ జరుగుతుంది, గ్రామ వాలంటీర్లను కచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్‌ చేద్దాం, వారిని సమర్థవంతంగా వాడుకోవాలని తెలిపారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల కోసం ప్రతి జిల్లాకు రూ.15 కోట్లు కేటాయిస్తునాం. కలెక్టర్లు తనిఖీలకు వెళ్లేలోపు వాటికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోండి, ఆ మేరకు నిధులను ఖర్చు చేయండఅని అధికారులకు సూచించారు. 2014–2019 వరకూ ఆత్మ హత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయి కానీ,391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయి, మీమీ జిల్లాల్లో డేటాను పరిశీలించండి, ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వండి-వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించండి,
కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు. #iprap Andhra Pradesh CM YS Jagan Mohan Reddy

About The Author