14 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు…
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలు పాటు శాసనసభ జరగనుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత శాసనమండలి సభా కార్యకలాపాల సలహామండలి సమావేశం చైర్మన్ ఎంఏ షరీఫ్ ఛాంబర్‌లో జరుగుతుంది.