త్రిబుల్ తలాక్ ను చట్ట విరుద్ధం చేసే బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర…
తక్షణ తలాక్‌ను చట్టవిరుద్ధం చేసే బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గురు వారం రెండున్నర గంటల చర్చ అనంతరం బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. విపక్షాలు ప్ర తిపాదించిన అన్ని సవరణలనూ ప్రభుత్వం తిరస్కరించింది. బిల్లులో అత్యంత వివాదాస్పదఅంశమైన ‘భర్తకు మూడేళ్ల జైలుశిక్ష’ నిబంధనపై ఓటింగ్ నిర్వహించగా 303 మంది సభ్యులు అనుకూలంగా, 82 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లుపై ప్రభుత్వ తీరు ను నిరసిస్తూ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. మోదీ రెండోసారి అధికారంలోకొచ్చాక జూన్‌లో ఈ బిల్లునే మొట్టమొదట ప్రవేశపెట్టారు. తక్షణ తలాక్ క్రిమినల్ నేరమంటూ గతంలో మోదీ సర్కారు మూడుసార్లు ఆర్డినెన్స్ తెచ్చింది.
కానీ ఒక్కసారీ బిల్లు కు పార్లమెంటు ఆమోదముద్ర సాధించలేకపోయింది. ఈలోగా లోక్‌సభ పదవీకాలం ముగిసింది. ఈసారి రాజ్యసభలోనూ బలం ఉండడంతో తాజాగా ఈ బిల్లు ను తెచ్చింది. ఎంపీలంతా హాజరై, సమ్మతిని తెలపా లని బీజేపీ విప్ జారీ చేసింది. ఈ బిల్లు సమాజంలో వివిధ వర్గాల మధ్య అపనమ్మకాన్ని పెంచుతుందం టూ బీజేపీకి కీలక మిత్రపక్షమైన జేడీయూ వాకౌట్ చేయడం విశేషం. బిల్లు స్ఫూర్తిని సమర్ధించినా అందులో స్పష్టత లేదని మరో పక్షం బీజేడీ పేర్కొంది.
బిల్లులో ఏముంది?
తక్షణ తలాక్ చట్టవిరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం దీన్ని తెచ్చింది. ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ’ బిల్లు అని దీనికి పేరు. భర్త మూడుసార్లు తలాక్ అనే పదా న్ని ఉచ్చరించి భార్యకు విడాకులు ఇవ్వడం నేరం. మౌఖికంగానే కాదు, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా గానీ, ఇతర ఎలకా్ట్రనిక్ మాధ్యమాల ద్వారా గానీ తలాక్ చెప్పడం చట్టవిరుద్ధం. ఇది బెయిల్‌కు వీల్లేని నేరం. అందుకు మూడేళ్ల దాకా జైలుశిక్ష విధించవచ్చు. అయితే అరెస్టయ్యాక సదరు భర్త ఓ మేజిస్ట్రేట్ నుంచి బెయిల్ పొం దే అవకాశం ఉంది. భార్య వాదన కూడా విన్నాక ఆమె చెప్పినది సబబని తోస్తే సదరు మెజిస్ట్రేట్ ఆ భర్తకు బెయిలివ్వవచ్చు. బిల్లుపై లోక్‌సభలో పదునైన చర్చ జరిగింది. ముస్లిం మహిళలనే లక్ష్యంగా చేసుకుని బిల్లు తేవడం రాజ్యాంగంలోని 14వ అధికరణానికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ అన్నా రు. బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. లైంగిక సమానత్వం కోసం, న్యాయం కోసం బిల్లును తెచ్చినట్లు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక కూడా దేశంలో 574 తక్షణ తలాక్ ఇచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ముస్లిం మహిళల గౌరవానికి ఇది అవసరమని పేర్కొన్నారు.