ద్వారకా తిరుమల గురించి తెలియని విషయాలు…
ద్వారకా తిరుమల( చిన్న తిరుపతి ) గురించి ఆలయ చరిత్ర చాలామందికి తెలిసిందే కానీ ఆలయంలో ఉన్న తెలియని ప్రత్యేకతలు గురించి చెప్తాను.
మాములు ప్రతి ఆలయంలో విగ్రహ మూర్తికి మూల విరాట్ ( దేవుని విగ్రహం ) ఒక్కటే ఉంటుందండి. కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్ లు ఉండి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు.
అలాగే ఆలయ చరిత్ర మనకు తెలిసిందే ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారు. అయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి వారు ఏ వరం కావాలి అని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాద సేవ చాలు అని చెప్పాడట దానితో ఆ మహర్షి కోరిక మేరకు స్వామి వారు అక్కడ స్వయంభు గా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాల కలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పై భాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో భక్తులు స్వామి వారిని కొలిచేందుకు కుదిరేదికాదట .. అసలు పాదసేవ ఏ అత్యంత ప్రాధాన్యం అది లేకుండా ఎలా అని అనుకోగా కొంతకాలానికి ఋషులు స్వామి వారిని స్వామి నీకు పూజ ఎలా చేయాలని వేడుకోగా మరొక మూర్తిని ( విగ్రహాన్ని ) ప్రతిష్టించి వలసినదిగా స్వామి వారు అన్నారట దీంతో ఋషులు తిరుమల ( పెద్ద తిరుపతి ) నుండి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూ వెలిసిన స్వామి వారి విగ్రహ వెనుక భాగంలో పాద సేవ కోసం ప్రతిష్టించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులు గా స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమల గా ప్రసిద్ధి చెందింది. రెండు మూల విరాట్ లు ఉండటం వలన ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు.
మాములుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా తిరుమలలో స్వామి వారు దక్షిణ ముఖంగా ఉంటారు. అలా ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వలన ఆయనకు ఎదురుగ స్వామి వారు ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మాములుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి వారికీ అభిషేకం చేయరు అది ఎందుకు అంటే స్వామి వారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి ఉందట అందుకే అభిషేకం చేయరు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడిన కొణిజులు ( ఎర్ర చీమలు ) విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. ఈ కారణం చేత ఇక్కడ స్వామి వారికీ అభిషేకం చేయరు. న్యూజివీడు జమిందారు గారు శ్రీ ధర్మ అప్పారావు గారు ఆలయ గోపురాలు, విమానాలు , ప్రాకారాలు అన్ని పునఃనిర్మాణం చేయించారు.