ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్

భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఈ వ్యోమ నౌకలోని ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. 

సోమవారం 12:45 గంటల నుంచి ఒంటిగంట 15 నిమిషాల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ల్యాండర్ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. 

ల్యాండర్ విడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియకు అది మరింత చేరువ కానుంది.

జులై 22 న శ్రీహరి కోట నుంచి  నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత నాలుగు సార్లు దాని కక్ష్యను ఇస్రో తగ్గించింది. చంద్రయాన్ టు వ్యూహమా నౌక పైభాగంలో ల్యాండర్ ఉంటుంది దీన్ని క్లయంపులు  ప్రత్యేక బోర్డులతో ఆర్బిటర్ కు అనుసంధానించారు. 

తొలుత ఆర్బిటర్ ల్యాండర్ ను సంబంధించి రెండు బోల్టులు తెగిపోయి ఫలితంగా ల్యాండర్ వేరు పడింది. 

సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ప్రయోగం లో అత్యంత కీలకఘట్టం మొదలుకానుంది. అదే రోజు చంద్రుని ఉపరితలంపై దిగనున్న ల్యాండర్..

About The Author