బోదకాలు వ్యాధి హరించుటకు సులభ యోగాలు

బోదకాలు వ్యాధి హరించుటకు సులభ యోగాలు –

* బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోదకాలు పైన పట్టించుచున్న బోదకాలు వల్ల వచ్చు వాపు హరించును .
* ఉమ్మెత్త వేళ్ళు , ఆముదపు వేళ్లు , వావిలి వేళ్లు , గలిజేరు వేళ్లు , మునగవేళ్ళు , ఆవాలు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి గోమూత్రముతో నూరి వెచ్చచేసి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* పిక్కలను ఎల్లప్పుడు దారంతో కట్టి ఉంచుచున్న బోధలు హరించును .
* పసుపు 10 గ్రా , బెల్లం 15 గ్రా , వడకట్టిన గోమూత్రం , 30 ml కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న దీర్ఘకాలం నుంచి బాధించుచున్న బోదకాలు వ్యాధులు హరించును .
* కరక్కాయ పెచ్చులు ను ఆముదంతో వేయించి ముద్దగా నూరి పూటకి ఉసిరికాయ అంత 30 గ్రాములు గోమూత్రంతో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న యొడల బోదకాలు వ్యాది హరించును .
* మంజిష్ఠ , అతిమధురం , సన్నరాష్ట్రం , జటామాంసి , గలిజేరు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి పులిసిన బియ్యపు కడుగుతో నూరి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* జిల్లేడు చెట్టు యొక్క పచ్చి బెరడు ముద్దగా నూరి బోదకాలు పైన , బుడ్డ ల పైన వేసి ప్రతినిత్యం కట్టుచున్న బోదకాలు హరించును .
బోదకాలు వ్యాది కి పైన మీకు సూచించిన సులభయోగాలు లలో లొపలికి తీసుకొనవలిసిన ఔషదాలు లో ఏదో ఒకటి సులభమైనది ఎన్నుకొని వాడండి . అదేవిధంగా పైన పూతగా కూడా సులభ యోగం ఎన్నుకుని కలిపి వాడండి . తొందరగా వ్యాధి నుంచి విముక్తి పొందుతారు.

గమనిక –
నేను రాసిన “ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అనేక అమూల్యమయిన వైద్యపరమైన ఆయుర్వేద మూలికల ఉపయోగాలు ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేదానికి సంభందించిన అనేక రహస్య యోగాలు , మా వంశపారంపర్య అనుభవ యోగాలు , మన చుట్టుపక్కల దొరికే మూలికలు మరియు ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతోనే పెద్దపెద్ద సమస్యలను నయం చేసుకునేవిధంగా అత్యంత సులభ యోగాలు మొక్కల యొక్క రంగుల చిత్రాలతో పాటు వాటి ఉపయోగాలు , చెట్లను బట్టి భూమిలో నీటిజాడను తెలుసుకొనుట, వృక్షాయుర్వేదం , పశువులకు సంబంధించిన అనేక యోగాలు మొదలైన అమూల్యమయిన విషయాలు ఇవ్వడం జరిగింది.
ఈ గ్రంథం యొక్క విలువ 350 రూపాయలు కావలసిన వారు ఫొన్ నందు సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 9885030034 .

About The Author