జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..?


ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ బుధవారం తీసుకుంది. దాంతోపాటు అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో లాంచ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం 6 వేల 450 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ కార్పోరేషన్ విభజనకు జగన్ కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే :

అమ్మ ఒడి కోసం రూ. 6450 కోట్ల కేటాయింపునకు ఆమోదం.
ఒకటి నుంచి ఇంటర్మిడీయేట్ వరకు చదవే పిల్లల తల్లులకు.. లేదా గార్డియన్లకు సాయం.
రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఉన్న అక్నాలెడ్జిమెంట్ ఉన్న దరఖాస్తుల ఆమోదం
జనవరి నెలలో అమ్మ ఒడి పథకం అమలు
77 మండలాల్లో గర్బిణులకు.. పిల్లలకు అదనంగా పౌష్టికాహారం.
కృష్ణా-గోదావరి కాల్వల శుద్ధి మిషనుకు ఆమోదం.
ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజనకు గ్రీన్ సిగ్నల్.
మాల, మాదిగ, రెల్లి ఇతర కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన.
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులివ్వాలని నిర్ణయం.
జనవరి-26, ఆగస్టు-15 రెండు సార్లు అవార్డుల అందచేత.
పురస్కార గ్రహీతలకు రూ. 10 లక్షలు పారితోషికం.
జెరూసలెం, మక్కా యాత్రలకు వెళ్లే వారికి ఆర్ధిక సాయం పెంపు.
స్టోన్ క్రషింగ్ యూనిట్ల ద్వారా రోబో శాండ్ తయారీని ప్రొత్సహించాలని నిర్ణయం.
ప్రభుత్వ నిర్మాణాల్లో 50 శాతం రోబో శాండ్ ఉపయోగించాలని కెబినెట్ నిర్ణయం.
డిస్కంల ఆర్ధిక వెసులుబాటు కోసం బాండ్ల జారీ నిర్ణయాన్ని రాటిఫై చేసిన కెబినెట్.
147 వైఎస్సార్ అగ్రీ ల్యాబులు. జిల్లా స్థాయి అగ్రీ ల్యాబులు.. నాలుగు ప్రాంతీయ కోడింగ్ సెంటర్ల ఏర్పాటుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్.
9 కోస్తా జిల్లాల్లో అక్వా ల్యాబుల ఏర్పాటు.
న్యాయవాదుల సంక్షేమ నిధి పెంపునకు చర్యలు.. రూ. 2 స్టాంప్ రూ. 20లుగా చేయాలని నిర్ణయం.
నవంబర్ ఏడో తేదీన అగ్రీ గోల్డ్ బాధితులకు చెల్లింపులు.
రూ. 20వేల లోపు ఉన్న డిపాజిట్ దారులకు చెల్లింపులు.
నవంబర్ 14 నుంచి నాడు-నేడు పథకం ప్రారంభం.
నవంబర్ 21న ఫిషింగ్ బోట్లకు సబ్సిడీపై డిజీల్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం.
వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సాయం అందచేత.
రోబో శాండ్ తయారు చేసే స్టోన్ క్రషింగ్ యూనిట్లకు మెషినరీ కొనుగోలు నిమిత్తం పావలా వడ్డీకే రుణాలు

About The Author