ఉక్కుమనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతి…


1909 అహ్మదాబాద్ లో ఒక కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి..ఒక లాయర్ తన వాగ్ధాటితో జడ్జిగారిని,కోర్టులోపల వున్న ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఇంతలో కోర్టు అమీన్ ఏదో కాగితం తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేరు. దానిని ఒకసారి చూసి కోటు జోబ్ లో పెట్టుకొని వాదనలు కొనసాగించారు ఆ లాయర్ …ఆ లాయర్ వాదన నెగ్గింది..కేసు గెలిచారు.. అప్పటి వరకు గంభీరంగా వాదించిన ఆ యువలాయర్ మొహం విషాదఛాయలు..తన సహధర్మచారిణి చనిపోయిందని కోర్టులో వారందరికీ చెప్పి ఇంటికి వచ్చేరు..4 సంవత్సరాల అమ్మాయి,2 సంవత్సరాల అబ్బాయి చిన్న పిల్లలు.క్యాన్సర్ తో భార్య మరణం..ఆయనను కృంగతీశాయి.. పెద్దలు రెండవ పెళ్ళి చేసుకోమన్నా అతను నిరాకరించారు.తన బిడ్డల ఆలనాపాలనా తనే చూసుకుంటానన్నాడు.
1911లో న్యాయశాస్త్రంలో స్పెషలైజ్డ్ కోర్స్ చేసేందుకు ఇంగ్లండ్ వెళ్ళేడు..36 నెలల ఆ కోర్స్ ను 30 నెలలోనే పూర్తిచేశారు.అదీ ప్రథమశ్రేణిలో.అప్పటికి అతని వయస్సు 36 సంవత్సరాలు.ఇంగ్లండ్ నుండి తిరిగివచ్చిన తర్వాత భారతలో ప్రముఖలాయర్ గా పేరుసంపాదించాడు.. ఎప్పుడూ ఆధునికమైన వస్త్రధారణతో వుండేవాడు..
ఇంతలో గాంధీజీ స్వాతంత్రపిలుపు విన్నాడు..అతని ప్రసంగం విని స్వాతంత్రోధ్యమంలోనికి ప్రవేశించారు. 1924లో బార్డోలిలో రైతులపై వేసిన పన్నులకు వ్యతిరేఖంగా మహాద్యమం నడిపి దేశమంతా గుర్తింపుపొందేరు..గాంధీజీ పిలుపుమేరకు సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని 300000ల మందితో 15లక్షల విరాళాలు సంపాదించి స్వదేశీఉద్యమానికిచ్చారు. తను ,తన పిల్లలు ఖద్దరే వాడతాం అని ప్రతిజ్ఞచేసి విదేశీవస్తువులను తగల బెట్టేరు.
1931లో జాతీయకాంగ్రీస్ సమావేశానికి అధ్యక్షత వహించారు.క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించారు..దేశవిభజన విషయంలో కొన్ని విషయాలలో గాంధీజీగారితో కూడా విభేదించారు..నెహ్రూ ప్రతిపాథించిన సోషలిజంలో కొన్ని లోపాలున్నాయంటూ విభేదించారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి రేసులో మొదటివాడిగా వుండి కూడా గాంధీజీ మాటను గౌరవించి ఉపప్రధానిగా, తొలి హోంశాఖామంత్రిగా పదవి చేపట్టారు. రాజ్యాంగరచనాసంఘంలో సభ్యుడిగా చేరేరు. రాజ్యాంగరచనాకమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ గారిని నియమించాలన్న గాంధీజీ వాదనకు గట్టి మద్ధతుగా నిలిచాడు. అందులో ప్రాధమికహక్కుల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించారు..ఆంగ్లోఇండియన్స్ నామినేటెడ్ ఈయన ప్రతిపాధించినదే.. ఆంగ్లేయులు పోతూ..పోతూ చాలా స్వదేశీసంస్థాలను ఇండియాలో కలపకపోగా ఇతను అత్యంత చాకచక్యంగా వ్యవహరించి,శాంతియుతంగా చాలా సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. మాట వినని కొన్ని సంస్థానాలను బలప్రయోగంతో ఇండియన్ యూనియన్ లో కలిపేరు..అందులో ముఖ్యమైనవి జునాఘడ్ ,హైదరాబాద్ సంస్థానాలు ముఖ్యమైనవి. నెహ్రూ మెతక వైఖరిని గట్టిగా వ్యతిరేఖించేవాడు.. రాజాజీని రాష్ట్రపతిగా నెహ్రూ ప్రతిపాధించగా అతనిని వ్యతిరేఖించి బాబూ రాజేంద్రప్రసాద్ గారిని రాష్ట్రపతిగా నిలిపేరు..కుల,మత,ప్రాధాన్యతలు ఇస్తే భవిషత్ లో ఇబ్బందులు వస్తాయని వాధించేవాడు..
కేవలం 40 నెలలు హోం మంత్రిగా పనిచేసినా చాలా విషయాలలో చాలా దృఢచిత్తంతో వ్యవహరించి ఇండియన్ యూనియన్ కు ఒక ప్రత్యేక ఆకృతి తెచ్చారు…ఆయనే “భారత ఉక్కుమనిషి”గా పేరుపొందిన “సర్థార్ వల్లభబాయ్ పటేట్ గారు.ఈయన సేవలకుగానూ 1991లో భారతప్రభుత్వం “భారతరత్న” బిరుదును ఇచ్చి గౌరవించింది..
“”ఉక్కుమనిషి పటేల్ గారి జయింతి నేడు””
ఒకగొప్ప స్వాతంత్రసమరయోధుని సేవలు గుర్తుతెచ్చుకుందాం

About The Author