కోణార్క సూర్య దేవాలయం – తాంత్రిక, వైజ్ఞానిక,యౌగిక విశ్లేషణ


“సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం……”

“అర్క” అనగా సూర్యుడు , కోణ అనగా ప్రాయోగికంగా త్రికోణము. త్రికోణముతో గూడిన స్థలము నందు యున్న సూర్య దేవాలయమునకు “కోణార్క” అని పేరు వచ్చింది . అక్కడ యున్న దేవతా స్వరూపాన్ని బట్టి ఆ పేరు వచ్చినది కూడా…..

ఈ స్థలము ఒరిస్సా రాష్ట్రము నందు (LAT 19″51’N ; LONG 86″01’E 😉 కుశభద్రానది ఒడ్డున , గుడికి నైఋతి దిక్కున 9 K.M వరకు ; త్రికోణ రూపముతో యున్నది . తూర్పున బంగాళాఖాతమున్నది.

కోణార్క సూర్య దేవాలయము ముందు యుండు మండపము నిర్మాణము :

ఈ క్షేత్రం లో సూర్యుని కిరణములు, రెండు కోణముల నుంచి గర్బగుడిలోని విగ్రహము వరకు ప్రసరించునట్లు వాస్తు శిల్పులు ఏర్పరచినారు. గుడి నిర్మాణము ఒక అంగుళములో వందోవంతు Accuracy గా ( 1/100″ ) యున్నది . అంటే అంత ఖచ్చితముగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆనాటి భారతీయ శిల్పుల ఉన్నత స్థాయి విజ్ఞానం ఇది. కాలక్రమేణా భూకంపముల వలన , పిడుగులు వలన గుడి శిథిలము చెందినప్పుడు….. తరువాత చరిత్ర కందని చాలా మంది గుడిని పునర్నిర్మాణము చేసినారు . అందువలన ఈ గుడిపై బౌద్ధుల, జైనుల సంస్కృతి ప్రభావములు యున్నవి . చరిత్ర ఆధారముగా “గంగా రాజవంశీకులు” పునర్నిర్మించినారు .

భవిష్య పురాణము, సాంబ పురాణముల ప్రకారము, శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబునికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ….శ్రీ కృష్ణుడు సాంబునికి యోగ విద్యతో పాటు చంద్రభాగా నది ఒడ్డున యున్న మిత్రవనములో, సర్వ వ్యాధులను తగ్గించెడి సూర్యుని కొరకు, అతని అనుగ్రహము సంపాదించుట కొరకై ప్రార్ధించమని తెలిపెను . అచ్చట సాంబుడు 12 సంవత్సరములు తపస్సు చేసిన తరువాత, కుష్ఠు వ్యాధి పూర్తిగా నివారింపబడెను .

సాంబుడు సూర్యునికి కృతజ్ఞతగా అచ్చట ఒక సూర్య దేవాలయము నిర్మాణమునకు సంకల్పించెను . సాంబునికి ఒక రోజు చంద్ర భాగా నదిలో స్నానము చేయుచున్నప్పుడు ; నదిలో ఒక సూర్య విగ్రహము లభించెను . మిత్ర వనములో ఆ విగ్రహమును ప్రతిష్ఠించి దేవాలయము నిర్మించెను . చంద్రభాగా నది సముద్రములో కలిసే చోటున ఈ దేవాలయము నిర్మించెను . ఈ దేవాలయమునకు ఎదురుగా ( తూర్పున ) సముద్రముండును . కాలక్రమేణా ఈ గుడి ముందు 3 కిలో మీటర్లు వరకు ఇసుక మేట వేసెను అందువలన సముద్రము ఇప్పుడు గుడికి 3 కిలో మీటర్ల దూరములో యున్నది .

యూరోపియన్ నావికులు ACE 1680 యందు ఈ దేవాలయాన్ని BLACK PAGODA గా పిల్చెడివారు . ప్రపంచవ్యాప్తముగా సూర్యుడు అన్ని విధములైన జబ్బులను తగ్గించును అనెడి భావముతో సూర్యదేవాలయము నిర్మింపబడినది . వేదాలలో సూర్యుని ఈ విధముగా తెల్పుచున్నారు .
▶సూర్యుడు విషనాశకుడు – ఋగ్ 1 -191 – 10
▶సూర్యుడు సామాన్యదృష్ఠికి అందని సూక్ష్మ క్రిములను ,

▶ సర్వపీడాకరములను సంహరించును , ఋగ్ 1- 191 – 8
▶ సూర్యకిరణములు తీక్షోష్ణ గుణము కలవి ; సర్వ చర్మవ్యాధులు , కుష్టు వ్యాధులు వీటి వలన తగ్గి , శరీరము ఆరోగ్యము పొందును – అధర్వః 24 – 1 .

▶”అర్క”ని ఆయుర్వేదము నందు “జిల్లేడు చెట్టు”గా పిలిచెదరు . మరల జిల్లేడు లో రకములు కలవు. దీనికి సూక్ష్మ పరిశీలన అవసరం. ▶జిల్లేడు శ్వాసకోశ వ్యాధుల యందు ; చర్మ వ్యాధుల యందు అమోఘముగా పనిచేయును ; ▶BRONCHAL ASTHMA & BRON CHITIS .

▶జిల్లేడు మూలిక కృశించిన శరీరాన్ని తిరిగి వృద్ధి చెందించి పూర్వ స్థితికి తెచ్చును. (అధర్వః 6 -72 – 1)

“కోణార్క” ను కోటి సూర్యులుగాను, లేక అనంతమైన సూర్యులు గాను భావించెదము . ఆయుర్వేదము నందు ఎన్ని ఎక్కువ పుఠములు పెట్టినచో ఆ మందు అంత శక్తి వంతమగును. కోణార్క ను కోటి పుఠములు లేక అనంత పుఠములు పెట్టిన జిల్లేడుగా భావించవచ్చును . ఎక్కువ పుఠములు పెట్టిన జిల్లేడు కుష్ఠురోగమునకు ఎంతో ఉపయోగకారి . “నాదయోగులు” ఎక్కువ మంది ఆయుర్వేద నిష్ణాతులు ;

త్యాగరాజు గూడ నాదయోగియే ; వారి కీర్తన యందు నిగూఢముగా “అర్క”ను వివరించినారు .
“ఆర్కమనుచు జిల్లేడు తరుపేరు
మర్కట బుద్ధులెట్లు లేరు
అర్కుడనుచు భాస్కరుని పేరు
తర్కమనే అంధకారము తీఱు !!”

ఈ వ్యాసము నందు తంత్రము గూర్చి కొంత అవగాహన అవసరము. కోణార్క్ దేవాలయము పూర్తిగా తాంత్రికముగా నిర్మింపబడినది . తంత్రము అనగా సాధనా శాస్త్రము . ఇందులో ఎట్టి విధమైన అభూత కల్పనలు యుండవు . ఒక నిర్ధుష్ఠమైన ధ్యేయము కొరకు సాధన చేసి ఫలితము పొంది స్వయం అనుభవముతో దానిపై నమ్మకమును పెంచుకొనుట యే తంత్రము. (PRACTICLE SCIENCE) .

ఊదా : మానసిక ఏకాగ్రత లేనివారు కొంతకాలము శాంభవి ముద్ర సాధన చేసిన యెడల ఏకాగ్రత లభ్యమగును . ఇదియే తాంత్రికము .

మానవునిలో యున్న సృజనాత్మకతశక్తియే కుండలిని. ఈ శక్తిని పెంపొందించుకొనుటకు సాధకులు “తంత్ర సాధన” అవలంబించెదరు .

ఉదా : మానసిక ఏకాగ్రత పెంచుట కొరకు .

▶మంత్రము :

24 ఓంకారములు ; ప్రతి ఓంకారము 20 సెకనులు తగ్గకుండ సాధన చేసిన యెడల మెదడులో ఏకాగ్రత ( తీటా అల ) పెరుగుతుంది .

▶యంత్రము :

కొంతకాలము రోజుకు 40 నిమిషములు తగ్గకుండ ఒక నిర్ధుష్ఠమైన , బిందువుపైన గాని , రూపముపై గాని , జ్యోతిపై గాని , “శాంభవీ ముద్ర” చేసిన యెడల మెదడులో తీటా అలలు పెరుగును .

▶తంత్రము :

ఒక నిర్ధుష్ఠమైన ధ్యేయముతో , అనుభవము కల్గిన వారి సమక్షములో మంత్ర , యంత్రముల సాధన చేసి స్వయముగా ఫలితము పొందుటయే తంత్రముగా మహర్షులు తెలుపుచున్నారు . యోగ శాస్త్రం ప్రకారము ఈ సృష్ఠి పంచ భూతములతోను , పంచతన్మాత్రలతోను నిండి యున్నది . ప్రతి అణువులోను ఒక బ్రహ్మాండం ఉన్నది . పూజ విధానములో అందరూ తెలిసో తెలియకో ఈ పంచతన్మాత్రలను పూజించుచున్నారు . ఇదియే తంత్రము .

▶పూజలో అగరువత్తులు , సాంబ్రాణి వాడుట వాసన తన్మాత్ర. ( గంధము – భూమి )

▶రుచికరమైన పదార్ధముల నైవేద్యము రుచి తన్మాత్ర ( జలం – నీరు )

▶దీపారాధన దృష్ఠి తన్మాత్ర ( అగ్ని )

▶గంధము బొట్టు పెట్టి అలంకరించుట స్పర్శ తన్మాత్ర ( వాయువు )

▶మంత్రములు ; గంటలు (శబ్ధ తన్మాత్ర – ఆకాశము )

▶మనము సాధారణ పూజ చేసిన కూడ మన మెదడులోని వాసన ; రుచి ; దృష్టి ; స్పర్శ ; శబ్ద కేంద్రములలో ఎరుక (awareness)పెరుగును . ఈ విధముగా వివరణలు తెలుసుకొని సాధన చేసి ఫలితము పొందుటయే తంత్రము .

▶ప్రపంచములోని అన్ని సంస్కృతులు వీటిని ఎదో ఒక రూపముగా అనుసరించుచున్నారు . ఈ సాధనల కొరకు దేవాలయములు కేంద్రములుగా ఏర్పరచుకున్నారు . సాధకులు ఈ కేంద్రములను చాలా శక్తి వంతముగా, పవిత్రముగా భావించుచున్నారు . ▶ బ్రిటన్లోని స్టోన్ హెంజ్ ; పిరమిడ్స్ ; సెంట్రల్ అమెరికాలోని మయాన్ పిరమిడ్స్ అన్నియు సాధన ( తాంత్రిక ) కేంద్రములే. తంత్ర విద్య మనిషి సంపూర్ణముగా ఎలా బ్రతకవలెనో తెలుపును .

▶ప్రసిద్ధ వైద్యులు PROF. K.N.UDUPA గారు పూజా విధానమును; శక్తివంతమైన మానసిక చికిత్సతో పోల్చినారు .

▶వరాహ తంత్రం మానవాళి పురోభివృద్దికి కావలసిన అంశములను ఈ విధముగా వివరించు చున్నది . 1) చైతన్యము 2) సృష్ఠి – ప్రళయము 3) దైవపూజలు 4) గ్రహములు , నక్షత్రములను గూర్చి 5) మానవ శరీరములోని నాడి వ్యవస్థ , మరియు చక్రములు 6) సాంఘిక ధర్మములు ; ఆచరణ 7) పుణ్యకార్యక్రమములు 8) మంత్ర – యంత్రములు 9) ముద్రలు 10) బాహ్య – అంతర్గత పూజలు 12) గృహములు , బావులు 13) పవిత్ర స్ఠలములు , గుడులు 14) దీక్షలు 15) యోగ 16) యోగ సాధనతో గూడిన ఆయుర్వేద వైద్యము 17) విజ్ఞానము మొ!! మహర్షులు తంత్ర విద్యయందు మానవాళికి కావలసిన సమగ్ర సమాచారమును వారికి కాలానుగుణముగా అందుబాటులో యున్న వానిని పొందు పరిచినారు . ప్రతి గుడి యందు ఈ సమాచారము అంతయూ యుండును .

▶భారత దేశములో ఆచరించు తంత్రములు 5 రకములు :

1) వైష్ణవ : ఉపాశ్య దైవము “విష్ణువు”. వీరి గ్రంథములను “వైష్ణవ ఆగమాలు” (పంచాయతనం) అందురు.

2) శైవము : ఉపాశ్య దైవము : శివుడు
అధ్యయన గ్రంథములు :శైవ ఆగమాలు

3) శాక్తేయము :

ఉపాశ్య దైవం : శక్తి యొక్క బహు రూపాలు.

గ్రంథములు : శక్త్యాగమాలు

4) సౌరము :

ఉపాశ్య దైవము : సూర్యుడు

అధ్యయన గ్రంథములు : సూర్యాగమాలు.

5) గాణపత్యులు: ఉపాశ్య దైవము : గణపతి,

అధ్యయన గ్రంథములు : గాణపత్యా గమాలు.

▶భారతదేశములో కొన్ని ముఖ్యమైన తాంత్రిక కేంద్రములు కలవు. వీటిలో ఒకటి ఒరిస్సా రాష్ట్రములోని పూరి (పురి) .

▶తాంత్రిక కేంద్రములు ఏర్పరుచుటలోని ముఖ్య ఉద్దేశ్యము: సాధకులు, సాధనలో అంతర్గతమై తన శరీరమునే తాంత్రిక కేంద్రముగా భావించి సాధన చేయుట .

“దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః”

దేహమే దేవాలయము. అందులోని జీవుడే దేవుడు. అన్నధ్యేయమే ముఖ్యము .

ఏ దైవాన్ని పూజించిన కూడ ; ఆ దైవ లక్షణములను మనలో పెంపొందించు కొనవలయును ; అప్పుడు సాధకుడిలో సృజనాత్మకత పెరుగును . ఇదియే మహర్షుల యొక్క ముఖ్య ఉద్ధేశ్యము . దీనినే యోగ విద్యలో “సంయమము” అందురు . అగ్ని పురాణము : రుద్రుని పూజించిన వారు రుద్రులు అగుదురు , సూర్యుని పూజించిన వారు సూర్యులు అగుదురు ; విష్ణువుని పూజించు వారు విష్ణువు అగుదురు . శక్తిని పూజించు వారు శక్తి అగుదురు . తంత్రము మానవ వికాసమునకు సమగ్ర శాస్త్రము అగుట వలనే, దీనిని ” భక్తి ముక్తి కారణిక ” అని అందురు . ప్రసిద్ధ విజ్ఞాన వేత్తలు పురాణములను మానవ పరిణామ ప్రక్రియకు పునాధి రాళ్ళుగా పేర్కొనినారు.

చైనాలో ఒక సామెత కలదు ” ఒక కళాకారుడు ఒక చెట్టు బొమ్మ వేయవలెనన్న ముందు తను ఆ చెట్టు కావలయును ; (MERGING : లయ) ; అప్పుడు చెట్టు పోలికలన్నియు తనలో వచ్చి ; చెట్టు బొమ్మకు సంపూర్ణ న్యాయము చేకూర్చును ” రామకృష్ణ పరమహంస గారు అమ్మవార్ని పూజించేటప్పుడు అమ్మవారి వలె , ఆంజనేయ స్వామిని పూజించునప్పుడు ; ఆంజనేయ స్వామి వలె ప్రవర్తించేడి వారు . అన్ని సంస్కృతుల యందు తాంత్రికము కలదు .ఈ అన్ని తాంత్రిక ప్రక్రియలు వారందరూ సనాతన ధర్మము నుండియే గ్రహించినారు.

దక్ష ప్రజాపతి కుమార్తె సతి . సతి తండ్రి అభీష్ఠమునకు వ్యతిరేకముగా శివుడిని వివాహమాడింది . దక్ష ప్రజాపతి యజ్ఞము చేయుచున్నప్పుడు , శివుడి మీద యున్న వ్యతిరేకతతో అల్లుడైన శివుడిని, కుమార్తె అయిన సతిని యజ్ఞమునకు ఆహ్వానించలేదు . సతీదేవి ఇది అవమానముగా భావించి యజ్ఞమందు దూకి మరణించినది . శివుడి ఆనతితో వీరభద్రుడు వచ్చి దక్ష యజ్ఞమును నాశనము చేసెను. విష్ణుమూర్తి గరుడ వాహనముతో పై నుంచి ; చక్రముతో సతీదేవి శవాన్ని ముక్కలు చేసి అన్ని పైపులకు విసిరివేసి తరువాత శివుడిని శాంతింప చేసాడు . సతీదేవి శవము యొక్క ముక్కలు పడినవన్నియు తాంత్రిక (శక్తి) కేంద్రములు .
▶ నాభి స్థానము (SOLAR Plexus) (KONARK) పూరిలో పడింది . అందువలన పూరి ఒక తాంత్రిక కేంద్రము . ఇది పురాణ విషయము .

▶ నిత్య జీవితములో మనము ఎన్నో పనులు చేస్తాము . పనులు చేసేది, SYMPATHETIC NERVES Dystem.

ఆలోచన ఇచ్చేది,
PARASYMPATIC Nerves System.

▶PITUTARY (శివుడు) . ఈ మూడు కలసి చేస్తే గాని ఫలితము (యజ్ఞము ) యుండదు .

▶అప్పుడు (శివుడు) PITUTARY శరీరమునకు ;
B.P ; DIABETIC ; PSYCHIC PROBLEM ,DIGESTIVE PROBLEMS ఏర్పాటు చేస్తుంది . శరీరము చాలా అస్థవ్యస్థమునకు చేరుతుంది . (ENDROCLINE IMBALANCE) . విష్ణువు (THYMUS ;WILL POWER) ; చక్రము (CONCETRATION) తో అనారోగ్యము పై కేంద్రీకరించి ; తన వైద్య శక్తితో PARASYMPATHIC NERVE ను సాధారణ స్థితికి తెచ్చి అనారోగ్యములు సరిచేయును . మెదడు యందు యున్న విపరీతమైన ఆలోచనలను చెల్లాచెదరు చేయుటయే సతీదేవి శవమును ముక్కలు ముక్కలుగా చేసి విసిరివేయుట . ఇది ప్రతి వ్యక్తియందు ప్రతి క్షణము జరిగెడి తంత్రము . (సశేషము)

About The Author