తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీ లక్ష్మా రెడ్డి…

తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీ లక్ష్మా రెడ్డి, ఎంపీ శ్రీ బాల్క సుమన్, తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, శ్రీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ కర్నె ప్రభాకర్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోంది అన్నారు.
* కూటమి ఏర్పాటుతో నీచ రాజకీయాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ఇపుడు ప్రలోభాలకు తెరలేపింది
* కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెరి సగం సీట్లు వస్తున్నాయంటూ తమకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలంటూ ఓ కాంగ్రెస్ నేత మా నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి కి ఫోన్ చేశారు
* కాంగ్రెస్ కు సీట్లు రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తోంది
* ఇలాంటి ప్రలోభాలను కాంగ్రెస్ వెంటనే ఆపాలి

మర్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ..
నాకు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ లోకి రమ్మని ప్రలోభ పెట్టారు అని తెలియజేశారు
* కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ అభ్యర్థించారు అని చెప్పారు
* మేము కెసిఆర్ సైన్యం లో ఉన్నాం ..మాకు 80 నుంచి 90 సీట్లు వస్తాయని విశ్వేశ్వర్ రెడ్డి తో చెప్పా
* ఇలాంటి నీచమైన ప్రలోభాలు మంచివి కావని చెప్పాను
* రెండు సార్లు ఫోన్ చేసినా అదే చెప్పాను
* చంద్రబాబు దర్శకత్వం లో ఇదంతా జరుగుతోంది
* కెసిఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు
* కెసిఆర్ ను ఎవ్వరూ వీడే ప్రసక్తి లేదు
* ఇలాంటి వెకిలి చేష్టలు కాంగ్రెస్ మానుకోవాలి అని హితవు పలికారు.

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ..
* ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డి గా మారారు అన్నారు.
* టీఆర్ఎస్ నేతలు నిప్పు లాంటోళ్ళు
* మా వాళ్ళ ని కాంగ్రెస్ నేతలు టచ్ చేస్తే చేతులు కాలిపోతాయి
* టీఆర్ఎస్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది
* కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి

ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ..
కేసీఆర్ సునామీ లో కూటమి నేతలు కొట్టుకు పోవడం ఖాయం అని చెప్పారు.
* మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదు
* లగడ పాటి, చంద్రబాబుల ప్రలోభాలకు తెలంగాణ లొంగదు
* విలువల గురించి మాట్లాడే విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతారా ?
* 85 నుంచి 95 సీట్లు టీఆర్ఎస్ గెలవబోతోంది
* రేపు మధ్యాహ్నం కల్లా టీఆర్ఎస్ ప్రభంజనం తెలిసి పోతుంది

తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
* కూటమి నేతలు ఆలీ బాబా 42 దొంగల ముఠా గా మారారు అని చెప్పారు.
* వారి ప్రలోభాలకు ఎవరు లొంగరు, రేపు వచ్చేది కెసిఆర్ సునామే
* తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..
* నాకు విశ్వేశ్వర్ రెడ్డి మొదటి వాట్సాప్ కాల్ ఈ రోజు మధ్యాహ్నం 2 .07 గంటలకు, రెండో కాల్ మధ్యాహ్నం 2 .56 కు చేశారు
* 9490861960 నంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది
* ఇక ముందు ఇలాంటి కాల్స్ చేయొద్దని చెప్పాను అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు ఇదొక నిదర్శనం అని తెలియజేశారు.

About The Author