ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “మానవ హక్కుల దినోత్సవం” రోజున “యువత హక్కులను” కాలరాసిన అధికార ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “మానవ హక్కుల దినోత్సవం” రోజున “యువత హక్కులను” కాలరాసిన అధికార ప్రభుత్వం..

https://www.youtube.com/watch?v=sNe9sNrHX-I

 

రాష్ర్టంలో నిరుద్యోగుల సమస్యలు,అవస్థలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని,ఉద్యోగ ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేయమని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయమని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో యువ మోర్చా నాయకులు విజయవాడలో,ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఏపీపీఎస్సి కార్యాలయానికి వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్న బీజేవైయమ్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా విచారణ చేపట్టారు.

వినతిపత్రం సమర్పించడానికి
ఏపీపీఎస్సి ఆఫీస్ కి వెళ్లిన కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు.

వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనకు గురై
తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.భవిష్యత్తు అంధకారంగా ఉన్న యువత చంద్రబాబు గారిని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని వేడుకొంటే ప్రజాస్వామ్య దేశంలో యువతకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వం.యువతకు న్యాయం జరిగే వరకు బీజేవైయమ్ రాజీలేని పోరాటం చేస్తుంది.

About The Author