న్యుమోనియాతో చిన్నారులు…


చలి తీవ్రత పెరగడంతో న్యుమోనియాతో చిన్నారులు వణికిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులను పరిశీలిస్తే ప్రతి పది మందిలో కనీసం రెండు కేసులు న్యూమోనియావే ఉంటున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వ్యాధిబారిన అధికంగా పడుతున్నారు. పలువురు మృత్యువు బారినపడుతున్నారు. ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అంతంత మాత్రంగా కావడంతో పేదలే బాధితులవుతున్నారు.
ఈ వ్యాధి తీవ్రత చలికాలంలోనే అధికంగా ఉంటోంది. పెద్దల్లో మద్యపానం, ధూమపానం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈవ్యాధి వస్తుండగా, చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, టీకాలు సరిగా వేయించకపోవడం వల్ల సంక్రమించే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌.. దేనితోనైనా ఇది వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గాలి, నీరు ద్వారానే ఇది సంక్రమిస్తుంది. చిన్నారుల్లో వారు పీల్చే గాలి, తాగే నీరు ద్వారా వ్యాధి కారక బ్యాక్టీరియా లేదా వైరస్‌ గొంతు నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. అప్పుడు ఊపిరితిత్తులు రుగ్మతకు గురై న్యుమోనియాగా మారుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే ఊపిరితిత్తుల నుంచి రోగపీడిత రక్తం గుండెకు సరఫరా అవుతుంది. గుండె ఇతర అవయవాలకు రక్తాన్ని పంపు చేయడంతో శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల శరీరంలో ఏదొక అవయవం పూర్తిగా పని చేయకపోయే అవకాశం కూడా ఉంది. చల్లటి గాలి తగలకుండా ఈసీజన్‌లో పిల్లలను జాగ్రత్తగా చూడాలి. వ్యాధి తీవ్రతను బట్టి నాలుగు రకాలుగా ఉంటుంది. బ్యాక్టీరియల్‌ న్యుమోనియో, వైరల్‌ న్యుమోనియో, శ్వాసకోస సంబంధిత న్యుమోనియో, ఫంగల్‌ న్యుమోనియోగా విభజించారు. బ్యాక్టీరియల్‌ వ్యాధి సాధారణంగా వచ్చేది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. ఇన్‌ప్లూయింజా ఏ, బి వ్యాక్సిన్లతో నివారించవచ్ఛు శ్వాసకోస న్యుమోనియో శుభ్రంగా లేని ఆహారం, ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఫంగల్‌ న్యుమోనియో విషజ్వరం వచ్చినపుడు ఫంగస్‌ల కారణంగా వస్తుంది. వైద్యశాల సరిసరాల్లో న్యుమోనియో సోకేందుకు అవకాశం ఎక్కువ. ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడటం, వాంతులు అవుతుంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అవసరం.

About The Author