1918-20 మధ్య కాలంలో “స్పానిష్ ఫ్లూ” వైరస్ వల్ల కోటి 70 లక్షల మంది చనిపోయారు


1918-20 మధ్య కాలంలో “స్పానిష్ ఫ్లూ” వైరస్ వల్ల కోటి 70 లక్షల మంది చనిపోయారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో మృతుల సంఖ్య కంటే ఇది ఎక్కువ.
భారతదేశాన్ని కూడా గడగడలాడించిన ఈ వైరస్ సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీజీకి సోకింది.
“గంగా నది శవాలతో ఉప్పొంగింది” అని ఒక కవి వర్ణించాడు.
ప్లేగు, కలరా, మసూచి, సార్స్, బర్డ్ ఫ్లూ, జికా, ఎబోలా గతంలో ఇవి ఏ దేశంలో పుట్టినా దేశాలను, ఖండాలను చుట్టాయి.

ఇది ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) యుగం. నగరీకరణ, పట్టణీకరణ దీని లక్షణం. గ్రామాల నుండి కోట్లాది మంది ఉపాధి కోసం నగరాలకు, పట్టణాలకు తరలిపోతున్నారు. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు నాశనం చేస్తున్నది, పెట్టుబడిదారీ వ్యవస్థ.
1980లలో అమెరికా వల్ల HIV వ్యాపించింది.
కోతుల నుండి జికా వైరస్ వచ్చింది.
ఈ తరహాలో వచ్చిందే చికెన్ గున్యా.
కరోనా కూడా చివరిది కాబోదు.
ఇక్కడ మనం భవిష్యత్తులో ఏమి చేయాలో నేర్చుకోకపోతే ఇంకా నష్టపోతాము.
ప్రపంచమంతా కరోనా మీద పోరాడుతుంటే మన తెలుగు రాష్ట్రాలలో యూట్యూబ్ వీరులు అబద్దాలతో బాధ్యతారాహిత్యంగా ద్వేషం రెచ్చగొట్టడానికి ఈ సందర్భాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.
చైనా దేశాన్ని మొత్తాన్ని ఇరాక్ తరహాలో తనిఖీ చేయాలంటాడు ఒకడు. యుద్ధం చేయాలంటాడు.

కానీ ప్రజలకు కావల్సింది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే పటిష్టమైన వైద్య ఆరోగ్య వ్యవస్థ. ఇప్పుడు ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకొనివ్వడం లేదు.
పది శాతం కేంద్ర బడ్జెటులో డబ్బు కేటాయించాలని, విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని ప్రజలు ఎక్కడ ఉద్యమిస్తారోనన్న భయం ఉన్న కార్పొరేట్లు, మనువాద మూకలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో
అసలు విషయాలను పక్కదారి పట్టిస్తున్నాయి.

మన డిమాండ్లు ఇకనుండి ప్రజల తరపున ఉండాలి తప్ప మతోన్మాద, బహుళజాతి కార్పొరేట్ కంపెనీల తరుపున కాదు.
ఇలాంటి వారి ప్రచారాలు నమ్మకుండా దూరం పెట్టాలి.
ఇప్పటికిప్పుడు అయితే ముందు జాగ్రత్త చర్యగా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటినీ ప్రభుత్వం జాతీయం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంటే మంచిదని వీళ్ళు చెప్పరు.
వీటితో పాటు రెక్కాడితే గానీ డొక్కాడని వారికి ఏమి చేయాలో సాయి లాంటి యూట్యూబ్ అధిపతి చెపుతాడా ? చెప్పడు.
ఇప్పుడు కూడా దరిద్రపుకొట్టు ద్వేషం కాదు. ప్రజలను కాపాడుకోవడం ఎలా అనేది పాలకుల, మానవత్వం ఉన్న మనుషులందరి కర్తవ్యం.
ఎక్కడ మంచి కృషి జరిగినా దాన్ని ప్రచారం చేయండి.
అక్కసు, కసి, ద్వేషం, విషంకక్కడం మానేసి ప్రజల పక్షాన నిలబడి పాలకులకు నిర్మాణాత్మక సూచనలు చేసి, వారు వేగంగా స్పందించేలా చేయండి.

About The Author