ఎలుకలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్ విజయవంతం ..
ఎలుకలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్ విజయవంతం .. వ్యాక్సిన్ తయారీలో పురోగతి
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తుంది. మరణ మృదంగం మోగిస్తుంది . ఈదేశం ఆ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంది. ఇక గంట గంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ సమయంలో కరోనాకు మెడిసిన్ ఎప్పుడు కనిపెడతారు అన్నది ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న అంశం . ఇక ఈ విషయంలో కాస్త పురోగతి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.
ఎలుకల మీద కరోనా ప్రయోగం సక్సెస్
ఎలుకల మీద కరోనా వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్
కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ప్రస్తుతం ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది . పిట్స్బర్గ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా విరుగుడు తయారు చేయడంలో పురోగతి సాధించారు.
ఇక వీరు కరోనా రోగుల శరీరాల్లో నుంచి రక్త నమూనాను తీసుకొని వాటిని ఎలుకల మీద ప్రయోగించారు. ఎలుకలలో కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక తాము తయారు చేసిన మందులు వారు ఎలుకలపై ట్రయిల్ చేసి సత్ఫలితాలను పొందారు . ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
మూడు మనుషులపైనా ప్రయోగాలు
మూడు నెలల్లో మనుషులపైనా ప్రయోగాలు
తాజాగా ఎలుకలపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినప్పుడు కావాల్సిన యాంటీ బాడీలు ఎలుక శరీరంలో ఉత్పన్నం కాగా అవి వైరస్‌ను తటస్థ స్థితికి చేయడానికి సరిపోతాయని యూనివర్సిటీ పరిశోధకుల టీం తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. ఎలుకలు ఆ వ్యాక్సిన ప్రభావంతో చాలా సమర్ధంగా కరోనాను ఎదుర్కొన్నాయి. ఇక రాబోయే మూడు నెలల్లోనే మనుషులపై ట్రయిల్స్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అవి విజయవంతం అయితే వ్యాక్సిన్ ఒక ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రావచ్చునని వారు అంటున్నారు.
కరోనా వైరస్ కు వ్యాక్సిన చేస్తున్న టీం కు ఇలాంటి వైరస్ లపై అపార అనుభవం
కరోనా వైరస్ కు వ్యాక్సిన తయారు చేస్తున్న టీం కు ఇలాంటి వైరస్ లపై అపార అనుభవం
అయితే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఈ టీమ్ 2003లో SARS-CoV, 2014లో MERS-CoVలకు పని చేశారు. ఈ రెండు వైరస్లు SARS-CoV-2కు సంబంధించినవే కావటంతో వీరు ఈ వ్యాక్సిన్ విషయంలో సక్సెస్ అవుతారనే భావన ఉంది . ఇక వారు కూడా తమకు కరోనా వైరస్ తో ఎలా ఎదుర్కోవాలో తెలుసని అంటున్నారు. ఇక మహమ్మారిని అరికట్టడంలో రోగనిరోధక శక్తిని ప్రేరేపించే ‘స్పైక్ ప్రోటీన్’ కీలకపాత్ర పోషిస్తుందని కో- సీనియర్ ఆండ్రియా గంబోట్టో తెలిపారు. ఏది ఏమైనా మరింత త్వరితగతిన ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని అన్ని దేశాల వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.