విజయవాడ పౌరసరఫరాల శాఖా కార్యాలయం నుంచి మంత్రి శ్రీ కొడాలి శ్రీవెంటేశ్వరరావు (నాని) ప్రెస్ మీట్…
1) కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ తో వీడియో కాన్ఫెరెన్స్ జరిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, ఎండి సూర్యకుమారి కూడా వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు.
2) ప్రధానంగా రాష్ట్రానికి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరాం.
3) అలాగే రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులు వున్నాయి. కానీ కేంద్రం మాత్రం 92 లక్షల కార్డులనే గుర్తించింది. వాటికి మాత్రమే ప్రధానమంత్రి ప్రకటించిన ఉచిత బియ్యం అందుతుంది. మిగిలిన 55 లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం.
4) 55 మంది లక్షల పేదలకు రాష్ట్రం అందిస్తున్న బియ్యం, ఇతర సరుకులను కూడా కేంద్రం నుంచి రాష్ట్రంకు రీ బ్యాక్ చేయాలని కేంద్రమంత్రిని కోరాం.
5) సివిల్ సప్లయిస్ ధాన్యం కొనుగోళ్ళకు రైతులకు చెల్లించాల్సిన సుమారు ఆరువేల కోట్లను గతంలో చంద్రబాబు పసుపుకుంకుమ పథకంకు మళ్లించాడు. ఆ నిధులను కూడా మేం రైతులకు చెల్లించాం.
6) మే నెల నాటికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతాయని, అందుకోసం కేంద్రం నుంచి 45వేల బెయిళ్ళ గన్నీ బ్యాగ్ లు రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రమంత్రిని కోరాం.
7) ఈ అంశాలపై కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలియచేశారు.
8) మార్చి 29 నుంచి నేటి వరకు రాష్ట్రంలో కరోనా వల్ల పేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యం, కందిపప్పును 1.35 లక్షల కుటుంబాలు తీసుకున్నాయి. దీనిలో సివిల్ సప్లయిస్ శాఖ, రేషన్ షాప్ లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేశారు. వారిని ఈ సందర్బంగా అభినందిస్తున్నాను.
9) చిన్నచిన్న సంఘటనలు జరిగితే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు, బూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు వీటిని పట్టించుకోరు.
10) పదహారో తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. 29వేల రేషన్ షాప్ ల ద్వారా కార్డులో పేరు వున్న ప్రతి వ్యక్తికి అయిదు కేజీల బియ్యం, ఒక కార్డుకు కేజీ శనగలు అందించబోతున్నాం.
11) కారోనా వల్ల భౌతికదూరం పాటించాల్సి వుంటుంది. అందుకే ఎక్కువ రేషన్ కార్డులు వున్నదుకాణాలను గుర్తించాం. 14వేల షాప్ లకు అదనపు కౌంటర్లు పెట్టి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, సివిల్ సప్లయిస్ ఎంప్లయిస్ లను బాధ్యులుగా నియమించి సరుకులు పంపిణీ చేస్తాం.
12) ఈ సారి టోకేన్ విధానంను అమలు చేస్తున్నాం. బియ్యం, శనగలు తీసుకునే కార్డుదారులు ఏ సమయాల్లో చౌకదుకాణంకు రావాలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రావాల్సిన వారికి సమయాలను సూచించేలా టోకేన్లను అందిస్తాం. చౌకదుకాణాల్లో రద్దీ లేకుండా సరుకులు తీసుకోవాలని రేషన్ కార్డు దారులకు మనవి. రెండు విడతలుగా గోడవున్ ల నుంచి రేషన్ షాప్ లకు సరుకులు పంపిస్తాం.
13) గూడ్స్ రైళ్ళ ద్వారా గతంలో 15,600 మెట్రిక్ టన్నులు రవాణా చేస్తే, ఇప్పుడు 65వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం రవాణా జరుగుతోంది. దీనిని నిర్వహించేందుకు 550 కు పైగా వున్న గిడ్డంగుల్లో వున్న ఉద్యోగులు, హమాలీలు, రవాణా సిబ్బంది, వారి ఆరోగ్యంను రిస్క్ లో పెట్టి మరీ ప్రజల కోసం కష్టపడుతున్నారు.
14) ఎ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని, సీఎం వైస్ జగన్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరికీ సరుకును అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కరోనా వైరస్ విపత్తు నుంచి బయపడేవరకు ఇలాగే కష్టపడాలని కోరుతున్నాం.
15) రాష్ట్రంలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారు. 33 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లయిస్ ద్వారా సేకరించాల్సి వుంది. దానిలో 50వేల టన్నులు ఇప్పటికే సేకరించాం. గ్రామ సచివాలయాల వద్ద రైతులు తమ పేర్లు నమోదు చేయించుకుని, వివరాలు ఇస్తే, సివిల్ సప్లయిస్ అధికారులే రైతు వద్దకువచ్చి ధాన్యంను అక్కడే కొనుగోలు చేస్తాం.
*రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ కోన శశిధర్ కామెంట్స్*
16) కేంద్రమంత్రి శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలకు అందిస్తున్న ఆహార సరుకులపై వివరించాం. గత మార్చి 29 నుంచి నేటి వరకు పిడిఎస్ పంపిణీ ద్వారా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రజలకు ప్రతి కార్డులోని సభ్యుడికి అయిదు కిలోలు, ఒక కేజీ కందిపప్పు అందించాం. వచ్చే పదహారో తేదీ నుంచి రెండో విడత ఉచిత పంపిణీ ప్రారంభిస్తున్నాం.
17) రబీ ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. 51 మెట్రిక్ టన్నుల ధాన్యంను, 993 కేంద్రాల ద్వారా సేకరించబోతున్నాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో డీ సెంట్రలైజ్ ప్రోక్యూర్ మెంట్ కు సీఎంగారు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ప్రతి గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొనగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నాం.
18) కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యంను మనరాష్ట్రంకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల వద్దే ధాన్యంను అడ్డుకుంటున్నాం. ఎంఎస్ పి ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఎక్కువగానే కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
19) కరోనా విపత్తు సమయంలో హెల్త్, శానిటేషన్, పోలీస్ శాఖలతో పాటు సివిల్ సప్లయిస్ శాఖ కూడా ప్రజలను ఆదుకునే చర్యలను చపట్టింది. ఎల్ పిజి, పెట్రోలియం అవుట్ లెట్ లను కూడా పర్యవేక్షిస్తున్నాం. ప్రధానంగా గిడ్డంగుల వద్ద వుండే హమాలీలు, 30 నుంచి 40 శాతం ఉద్యోగులతోనే డిపార్ట్ మెంట్ పనిచేస్తోంది.
20) చౌకదుకాణాలకు పదిహేను రోజులు జరిగే సరుకుల రవాణాను వారం రోజుల్లో పూర్తి చేశాం. అటు రైల్వేలు, ఇటు డిపార్ట్ మెంట్, హమాలీలు, ఉద్యోగులు, డీలర్లతో సమన్వయం చేసుకుంటున్నాం. ప్రతి డీలర్ వద్ద విఆర్ ఓ ను నామినీ ఆఫీసర్ గా పెట్టాం.
21) పదహారో తేదీ నుంచి సరుకుల పంపిణీకి ప్రత్యేక విధానం, కూపన్ విధానంను కూడా అమలు చేస్తాం. మందుగానే కార్డుదారులకు కూపన్లు ఇస్తాం, భౌతికదూరంను పాటించాలి, అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. సరుకులకు ఎక్కడా కొరత లేదు, ఒకేసారి గుమిగూడకుండా సరుకులను పొందాలని కోరుతున్నాం.
22) గ్రామస్థాయిలోనే రైతులు ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోస్టర్ లను కూడా ప్రింట్ చేసి, గ్రామసచివాలయాలకు పంపించాం. ఈసారి ఖచ్చితంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్ళు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అక్రమాలు జరగకూడదని, వేరే రాష్ట్రాల నుంచి స్టాక్ రాకూడదని చర్యలు తీసుకుంటున్నాం. కౌలురైతులు, పట్టాదారుల పేర్లు ఈ క్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు నమోదు చేశారు.
23) ఎక్కడైనా సమస్యలు వుంటే మండల వ్యవసాయశాఖ అధికారి దృష్టికి తీసుకువెడితే వారు పరిష్కారం చేస్తారు. రైతులు మద్దతుధరకు తక్కువగా తమ ధాన్యంను విక్రయించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సమస్య వున్నప్పటికీ 29 వేల రేషన్ షాప్ లకు సకాలంలో సరుకులు అందించాం, అలాగే ధాన్యం కొనుగోళ్లు కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
24) పదహారో తేదీ నుంచి ఒక కుటుంబానికి కేజీ శనగలు, కార్డులోని సభ్యులకు ఒక్కొక్కరికీ అయిదు కేజీల బియ్యం ఉచితంగా అందిస్తాం. గతంలో కందిపప్పు ఇచ్చాం. మే ఒకటిన మళ్లీ కందిపప్పు ఇస్తాం. ప్రజలు సురక్షితంగా వుండాలని రేషన్ దుకాణాల వద్ద భౌతికదూరంను పాటిస్తే, సరుకులు తీసుకోవాలి. వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వారి ఫోటోగ్రాఫ్ కలెక్ట్ చేస్తారు.
25) రేషన్ షాప్ సమయాలను స్థానికంగా వున్ కలెక్టర్, ఎస్పీలు నిర్ణిస్తారు. 1902 కాల్ సెంటర్ కు సమస్యలు వుంటే కాల్ చేయవచ్చు.
26) పాత రేషన్ కార్డు దారులకు రేషన్ అందిస్తున్నాం. అలాగే సీఎంగారి ఆదేశాల మేరకు అర్హత వున్న ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం.కార్డు లేని అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి సరుకులను అందిస్తాం.
27) ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోర్టబిలిటీ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. 33 లక్షల మంది పోర్టబిలిటీ వారికి కూడా వారికి కూడా కూపన్లు అందిస్తున్నాం.
28) ఎంఎస్పి సరిగ్గా రాకపోయినా, దళారులు మోసం చేస్తున్నారనే అనుమానం కలిగితే రైతులు 1902 కి ఫోన్ చేయవచ్చు.
29) ప్రతిరోజూ ఆన్ లైన్ ఫీడ్ బ్యాక్ ను అగ్రికల్చర్ విభాగం ప్రవేశపెట్టింది. ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు, ఎంఎస్ పి సమస్యలపై రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకునే యాప్ వారు తయారు చేశారు. దాని ద్వారా ధాన్యంకు సంబంధించిన వివరాలను తీసుకుంటున్నాం. సమస్యలు వుంటే రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు తెలియచేయవచ్చు.
30) రాష్ట్రంలో 29,783 చౌకదుకాణాలు వున్నాయి, వాటికి 14,315 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఇప్పటికే డోర్ డెలివరీ జరుగుతోంది. 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు 2 , 500 షాప్ లకు 3 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటికి తూకం యంత్రాలను కూడా సమకూర్చాల్సి వుంది.
31) ఎక్కడైనా రేషన్ దుకాణాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే ప్రత్యామ్నాయంగా రేషన్ ప్రజలకు ఇచ్చే లా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే డ్వాక్రా సంఘాలకు కూడా దానిని కేటాయించేలా ఆదేశాలు.