కరోనాతో రెట్టింపు అయ్యిన మామిడి రైతుల కన్నీటి కష్టాలు..


కరోనాతో రెట్టింపు అయ్యిన మామిడి రైతుల కన్నీటి కష్టాలు..
కొనే నాధుడే లేక విలపిస్తున్న మామిడి రైతులు ..సాధారణ సమయాల్లో కూడా గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కష్టాలు మీ కోటిపల్లి కాలంలో*
*?ప్రతి ఓక్కరు షేర్ చెయ్యండి*
?ఈ ఏడాది సరిగ్గా మామిడి సీజన్ మొదలు అవ్వగానే కరోనా మొదలు అయ్యింది.. కేవలం మూడు నెలలు మాత్రమే మామిడి సిజన్ ఉంటుంది ఇప్పటికే కరోనాతో దాదాపుగా 2 నెలలు గడిచించి ఇంకో 30 రోజులు మాత్రమే మామిడి సీజన్ ఈ మధ్యలో వర్షం పడితే మామిడి కొనే నాధుడే ఉండడు ఈలోపు కాయలు కొద్దాము అన్నా మనుషులు దొరకడం లేదు …
?దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో మామిడి రైతులు పరిస్థితి ఒకే రకంగా ఉంది …పంట ఎక్కువ ఉంటే రేటు ఉండదు…రేటు ఉంటే పంట ఉండదు…ఈ ఏడాది కరోనాతో పంట తక్కువ ఉన్నా కొనే నాధుడే లేడు…
✍దేశంలో అనేక రాష్ట్రాల్లో మామిడి జాతులకు మంచి పేరు ఉంది ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన మామిడి పంటకు ప్రసిద్ధికెక్కింది
✍దక్షిణాది రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ప్రధానసాగు పంటల్లో మామిడి ఒకటి.5 ఏళ్ళు మొక్క పెంచితే ఏడాదికి ఒక్కసారి వచ్చే పంట అయినా సరిఅయ్యిన ధర లేక పెంచిన చెట్టు కొమ్మలకే ఉరి వేసుకుంటున్న రైతులు..
✍అది సాక్ష్తత్హు 30 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి జిల్లా రాయలసీమ లో 50 ఏళ్ళు కు పైగా సీఎం లు పాలన చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రాయలసీమ అయ్యినా మామిడి రైతులకు గిట్టుబాటుధర మద్దతు ధర కల్పించడం లో పూర్తిగా విఫలం అయ్యారు.మామిడి సాగుని నమ్ముకొని చిత్తూరు జిల్లాలో గుడిపాల, బంగారు పాల్యం, చిత్తూరు, పాకాల,దామల చెరువు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం,పూతలపట్టు,యాదమరి,గుడుపల్లె,మదనపల్లి,తంబలపల్లి,తవణంపల్లి,పుంగునూరు,పీలేరు,తిరుపతి,కాలహాస్తి,రొంపిచెర్ల,పెనుమూరు,చంద్రగిరి ,నగిరి,సత్యవేడు మరియు ఇతర మండలాలలోనీ కొన్ని మొత్తము 60 వేలు రైతు కుటుంబాలు బ్రతుకుతున్నాయి.. దక్షిణ భారత దేశంలో సుమారు 70 లక్షల రైతు కుటుంబాలు మామిడి పంట పై బతుకుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే మామిడి జాతుల్ని(పందిరి పనస,ఆల్ఫీన్, తొత పురి,హైజర్లు,సువర్ణ రేఖ, పంచదార కల్తీ, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, కొబ్బరి మామిడి, ఏనుగు తొండాలు, పనుకులు, పండూరి మామిడి, పాపారావు గోవా,బంగిన పల్లి ,
మొక్క బంగినపల్లి , రసాలు,….125 రకాలు) సాగుచేస్తున్న ప్రయోజనం సున్యం
✍మన తెలుగురాష్ట్రాల్లో ప్రజా నాయకులకి దాదాపుగా అన్ని జిల్లాలలో ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు మరియు మాజీ ఎమ్మెల్యేలకు మామిడి కాయల ఫ్యాక్టరీలున్నాయి.. రాయలసీమలో చిత్తూరులో ఉన్న ఫ్యాక్టరీలు అన్ని దాదాపుగా ప్రజా నాయకులవే కానీ రైతుల కన్నీటి బాధలు వాల్లకు వినపడటం లేదు ఓటు కోసం మా గుమ్మాలు తొక్కుతున్నారే కాని మా భాధను చిటికెంతైనా పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న వాల్లకీ కూడా ఫ్యాక్టరీలు/మండీలున్నయి కాని మా గోడు పట్టించుకోవట్లేదు
✍సంవత్సరంలో ట్రాక్టర్ తో మూడు నాల్గు సార్లు దున్నడానికీ డబ్బు ,నీల్లు రావడానికీ బోర్లకో/ట్యాంక్ర్లకో/కరెంట్ కో పెట్టడానికీ డబ్బు,చెట్లకు మందులు/ఏరువులు వేయడానీకీ డబ్బులు,పనులకు వచ్చే వాల్లకు డబ్బులు,మామిడీ పూత రావడానికీ మందు కొట్టేకీ డబ్బు, మామిడి పిందెలు నిలవడానికీ కొట్టే మందులకు డబ్బు,
కాయలకు నల్ల మచ్చలు పడకుండా ఉండేదుకు కొట్టే
మందులకు డబ్బు,
మామీడీ కాయలు కోయడానికీ పనికీ వచ్చే వాల్లకీ డబ్బు,
మామిడినీ ఫ్యాక్టరీ/మండీలకు తరలించేందుకు డబ్బు,
మండీలలో కమీషన్/ ఫ్యాక్టరీలలో దించడానీకీ లేదా ఫ్యాక్టరీలలో బిల్లు రాసేవాల్లకుడబ్బు.
ఇదే కాకుండా మామిడీ వర్షానికీ రాలిపోతాయి గాలికీ రాలిపోతాయి…ఒక్క నాడు కాపలా ఉండక పోతే దొంగలు కోసుకు పోతారు..కాపలా వారికి డబ్బు తీరా ఇంత మందికి డబ్బులు ఇచ్చినా ఇంత నష్టం జరిగినా…. సంవత్సరం పొడవునా ఏదురు చూస్తే ప్రతి సంవత్సరం కేజీ 7.5 రూ మాత్రమే …జ్యూస్ కు వాడే బెంగుళూరు మామిడి కాయలను అతి దారుణంగా రైతుల నోట్లో మట్టి కొట్టి ఫ్యాక్టరీ/మండీ యాజమాన్యం కొనుగోలు చేసి బ్రతకుతున్నారు .సంవత్సరమంతా పెట్టిన పెట్టుబడులలో కనీసం రాకుంటే ఏం చెయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం
?గత 10 ఏళ్లుగా దక్షిణాది లో 6 లక్షల మంది రైతులు ,తెలుగు రాష్ట్రాల్లో 35 వేలమంది రైతులు, ఆంధ్ర ముఖ్యమంత్రుల ప్రాంతం
రాయలసీమ లో 15 వేలు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.మాజీ ముఖ్యమంత్రి జిల్లా ఒక్క చిత్తూరులోనే 5 ఏళ్లలో 7800 మంది ఆత్మహత్య చేసుకున్నారు
✍️ఈ ఏడాది కరోనా తో ఇంకా తీవ్రంగా నష్ట పోయాము అని గత ఏడాది కూడా 5 నుంచి 6 రూపాయలు మాత్రమే కొనుబడి ఉంది .మా కష్టాన్నీ అర్థం చేసుకోనీ కనీసం 15 రూపాయలైన గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుందని రైతులందరి ఆవేదన. రోడ్డుకొస్తే ఏక్కడ ఇంకా రేటు తగ్గిస్తారోనని భయాందనలో ఉన్నాం. దీనిపై స్పందించి 99 న్యూస్ వారు ప్రభుత్వాలకు తెలియ చేసి మా కష్టాన్ని గట్టేక్కెంచాలనీ కోరుతున్నాం.
✍మనకు ఎన్నో రుచులు కల్గిన మామిడి అందించిన రైతు కుటుంబాలు ఈరోజు పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక చదివించలేక దర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్నారు.
?బాహ్య మార్కెట్లో మామిడి ధర కేజీ 60 పైనే అరలిటర్ మామిడి జ్యుస్ 70 రూపాయలు, కేజీ పచ్చడి 150 రూపాయలు అయ్యినా రైతుధర 5 నుంచి 8 రూపాయలే .
✍పచ్చళ్ళు , మామిడి తాండ్రలు, దీర్ఘకాలిక జ్యుసులూ, మామిడితో ఎన్నో చేస్తున్నా దళారుల దోపిడీకి డగాపడుతున్న మామిడి రైతులు
*?మమిడి రైతుల కోసం ప్రభుత్వానికి కోటిపల్లి కాలం సూచనలు*
?మామిడి పంట అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించి ప్రతి. మండలంలో మామిడిరైతు మార్కెట్లు, మండిలను ఏర్పాటు చేయాలి..
?అధిక మామిడి పంట దిగుబడికి పూత కు ,పిందెకు,కాయ మచ్చలకు కోపరేటివ్ సొసైటీ ల ద్వారా సబ్సిడి ఇచ్చి వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సుచనలతో సలహాలతో తగిన క్రిమిసంహారక మందులు అమ్మించాలి…
?సుదీర్ఘకాలం నిల్వఉండే మామిడి ఆహార ఉత్పత్తులు అయిన మామిడి తాండ్రలు, జ్యుస్ లు,పచ్చళ్లు ,మామిడి తురుము లాంటి మామిడి ఆధారిత పరిశ్రమలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధర కల్పించే ఏర్పాటు చేయాలి.
?మామిడి కాయలు, పండ్లను నిల్వచేసే కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేయాలి..
?మామిడి జాతి పంటలకు వచ్చే తెగుళ్లు నివారణకు కొరకు ప్రతి జిల్లాలో వ్యవసాయ పరిశోధనా సంస్థ ద్వారా వ్యవసాయ శాస్త్ర వేత్తలను ,నిపుణులు ద్వారా సలహాలు సూచనలు అందించాలి.
?ప్రజల ప్రాణనానికి హాని చేసే కుత్రిమ విషరసాయన పదార్థాలు మామిడి పండ్లు ముగ్గడానికి వాడకుండా గడ్డి ద్వారా పక్వానికి వచ్చే పద్ధతులు పాటించేలా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి
?తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి వచ్చే మేలైన మామిడి జాతి అంటు మొక్కలను రైతులకు అందించాలి.
?మామిడి పండ్లు సీజనల్ లో కాకుండా అన్ని కాలాల్లో కాసే అంటులను తయారీకి శ్రీకారం చుడితే రైతులను ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది..
?మామిడి చెట్లు పైనుండి పడిపోయి ప్రమాదాలకు గురి అవ్వుతున్న రైతులు కోసం మామిడి చెట్లు ఎక్కడానికి అత్యాధునిక పరికరాలును అందించి ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టాలి…
? భారతీయ మామిడి ఉత్పత్తిలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది … దీర్ఘకాలం నిల్వ ఉండే మామిడి ఉత్పతులను (మామిడితాండ్రలను ,పచ్చళ్లు,
జ్యుస్ లు ,మామిడి తురుము) ఓడరేవులు ద్వారా విదేశాల ఎగుమతులకు సన్నాహాలు చేయాలి… మామిడి పరిశ్రమలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలి….
?సరికొత్త ఆలోచనలు పాలకుల్లో రావాలని మామిడి రైతుల్ని ఆదుకోవాలని మీ కోటిపల్లి కాలం .
.99 న్యూస్..
*✍మీ కోటిపల్లి అయ్యప్ప*
*M.Tech,M.BA,M.L*
*Save Democracy*

About The Author