పీలేరులో గాలి, వాన బీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు…


పీలేరు పట్టణంలో గాలి,వాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా జోరుగా వీచిన గాలికి స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణలోని ఓ పెద్ద చెట్టు కూలి ప్రహరి దెబ్బతింది. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న ఆటో కూడా ధ్వంసం అయ్యింది. అక్కడికి సమీపంలోని వారపు సంతలో మరో వృక్షం విరిగి రోడ్డుకు ఆడ్డంగా పడిండి. వ్యవసాయ కార్యాలయం ముందు ఓ విద్యుత్ స్తంభం విరిగి నేలవైపుకు వాలింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు, ప్రజలు తిరగడానికి తీవ్ర ఆటంకం కలిగింది. వర్షం ప్రారంభమైన వెంటనే ట్రాన్స్కో శాఖ విద్యుత్ సరఫరాను ఆపేయడంతో పెద్ద ముప్పు తప్పింది. వర్షం ఆగిన తరువాత విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్హు పనులు చేపట్టి ఆలస్యంగా విద్యుత్ సరఫరా చేశారు.

ఫోటో రైట్ అప్: పీలేరు వారపు సంత దగ్గర విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు (29పీలేరు 02)
– టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణంలో చెట్టు కూలడంతో దెబ్బతిన్న ఆటో (29 పీలేరు 03)
– పీలేరు వ్యవసాయ కార్యాలయం ముందు విరిగిన విద్యుత్ స్తంభం దృశ్యం (29పీలేరు 04)

About The Author