మా’కే చెప్పలేదు… బాలయ్యను నేనేలా పిలుస్తా : నరేష్


తెలుగు సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న సమావేశాలకు తనను పిలవడం లేదని.. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరోసారి మీటింగ్ జరిగింది. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి మరో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. నటుడు సీనియర్ నరేష్.
సి కళ్యాణ్ మాట్లాడుతూ .. “మీటింగ్స్ కు అందరినీ పిలవాలని రూల్ లేదు, బాలకృష్ణ తో పాటు చాలా మంది హీరోలను పిలవలేదు.. బాలకృష్ణ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం. అయినా బాలకృష్ణను పిలవాల్సింది మా అసౌసియేషన్ ” అని అన్నారు. దాని పై ‘మా ‘ప్రెసిడెంట్ నరేష్ స్పందిస్తూ … సి కళ్యాణ్ స్టేట్మెంట్ షాక్ కు గురిచేసిందని అన్నారు. “మీటింగ్ కు మమ్మల్నే పిలవలేదు మేము బాలకృష్ణ ను ఎలా పిలుస్తాం .. ?”అని అన్నారు. ‘మమల్ని పిలవని మీటింగ్ కి మేము వేరేవాళ్లను ఎలా పిలుస్తాం .. సీ. కల్యాణ్ బాలకృష్ణను మా ఆహ్వానించాలి అనడం సరికాదు.’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టారు.

About The Author