వైసీపీ ఏడాది పాలన మీద బాబు విమర్శలు..విరుచుకుపడ్డ విజయసాయి…
వైసీపీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు. 6 నెలల పాటు ప్రభుత్వానికి సహకరించాలనుకున్నా తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది పొడవునా కొనసాగించారని, అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచారని ఆరోపించారు. రైతులు, కూలీలు, పేదలు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించారని అమరావతి దీక్షలే దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
న్యాయం కోసం అమరావతి ప్రజలు, విశాఖలో విషవాయువు బాధితులు, కరోనాతో కర్నూలు వాసులు, ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయి నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కిపోయి ఉద్యోగాలు లేని యువత… ఇలా ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా? ఏం సాధించారని? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా బాధ్యతగా పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.
జగన్ ఏడాది పాలనను విమర్శిస్తూ చంద్రబాబు ట్వీట్లు చేయడంతో… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేతకు కౌంటర్‌గా రెండు ట్వీట్లు చేశారు. కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా? అనే అంశంపై ఎవరైనా మాస్టర్స్ డిగ్రీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్లైన్ కోర్సులు జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే… మన నెగటివ్ థింకింగ్ పితామహుడు చంద్రబాబును సంప్రదించవచ్చంటూ ట్వీట్ చేశారు… విజయసాయి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఏడాదికి ఓసారి తీర్మానం చేస్తూ… 25 ఏళ్ల కిందట మరణించిన ఆయన్ను ఆటపట్టించడం… ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేయడమే అన్నారు… విజయసాయి. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలు ఆడటం నీచాతి న