ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా….?


– కరోనా కేసుల నేపథ్యంలో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో అధికారుల హడావుడి.
– మౌలిక సౌకర్యాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం.
– చేతికి గ్లౌజులు, నీడిల్స్, సిరంజిలు, ల కొరతతో ఒక మహిళ మృతి.
– ప్రైవేట్ వైద్యశాల ల నిర్బంధం తో ప్రభుత్వ వైద్యశాలకు పెరుగుతున్న రోగుల సంఖ్య.
– ప్రాణాలు పోతున్న పట్టించుకోవటంలేదు, మందులు లేవు, కనీస సౌకర్యాలు లేవు, అంటున్న రోగులు.
– వంద పడకల సామర్థ్యం గల వైద్యశాల 30 పడకల ను కూడా నిర్వహించ లేకపోవటం పై ప్రజల ఆగ్రహం.
– పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు.
– పేద వాళ్లకు రోగం వస్తే ప్రాణాలు వదిలివేయటం మేనా అని ప్రశ్నిస్తున్న సామాన్యులు.
– ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.
కాకతీయ. క్రైమ్ న్యూస్:
మాచర్ల పట్టణ ప్రభుత్వ వైద్యశాల కరోనా నేపథ్యంలో మాచర్ల పట్టణములో కేసులు నమోదు కావడంతో మరియు ప్రైవేటు వైద్యశాలలు నిర్బంధంలో ఉండటంతో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మాచర్ల పట్టణ పరిసర గ్రామాల వారికి పెద్ద వైద్యశాల ఇదే కావడంతో ఆరోగ్య సేవలు అందిస్తున్న మాచర్ల ప్రభుత్వ వైద్యశాల ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో చిక్కుకుంది. అనేక సమస్యలు ఆసుపత్రిని చుట్టుముట్టడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి వంద పడకల వైద్యశాల నిర్వహణ సామర్ధ్యం గల వైద్యశాల 30 పడకల వైద్యశాలగా కూడా బాధ్యతలు నిర్వహించ లేకపోవడంపై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని వాపోతున్నారు. మాచర్ల పట్టణంలోని శ్రీశైలం రోడ్డు నందుగల ఒక మహిళ అనారోగ్యంతో ప్రైవేటు వైద్యశాలల నిర్బంధం నేపథ్యంలో చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళగా ప్రభుత్వ వైద్యశాల నందు కనీస సౌకర్యాలైన చేతికి వేసుకునే గ్లౌజులు లేకపోవడంతో రోగి భర్తతో గ్లౌజులు, నీడిల్స్, సిరంజులు, బయట నుండి కొనుగోలు చేసి తెచ్చుకోవాలని వైద్యులు సూచించగా హడావుడిగా బయటకు వెళ్లి అవి కొనుక్కొని రావటానికి ఆలస్యం అవటంతో ఆ కొద్ది సమయంలోనే ఆ మహిళ మృతి చెందటం చర్చనీయాంశంగా మారింది. పాపం ఆ రోగి భర్త భార్య చివరి క్షణాలు కూడా పంచుకో లేకపోవడంతో తీవ్ర మానసిక ఉద్వేగానికి గురి కాబడినాడు.కనీస అవసరాల కొరతతో వైద్యులు ఆ మహిళను తాకి చూడలేకపోయారు ఆమెను బ్రతికించే ప్రయత్నం చెయ్యలేకపోయారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందాన ఒక పక్క అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రజల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతామని చప్పట్లు కొట్టించుకుని పేపర్లో ఛానల్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజా సంఘాలు ,ఒక్కసారైనా ప్రభుత్వ వైద్యశాల పై దృష్టి పెడితే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశమే ఉండదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి చిన్నచిన్న కారణాలకే రోగుల ప్రాణాలు వదిలేస్తుం టే కరోనా లాంటి మహమ్మారిని ఏ విధంగా ఎదిరించ గలరు అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ప్రభుత్వ వైద్యశాల ను నమ్ముకునే ఎక్కువమంది ప్రజలు, అప్పు చేసైనా ప్రైవేట్ వైద్యశాలలలో చికిత్స చేయించుకోవాలి అనుకునేవారికి, ప్రైవేట్ వైద్యశాల లు నిర్బంధంలో ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు, మరింత భయాందోళనకు గురి కాబ డు చున్నారు.అభద్రతాభావం లో ఉండి పోవాల్సిందే నా, ఈ సమస్యను ఎవరు పరిష్కరించ లేరా అనే ప్రశ్నలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి.
ప్రతిరోజు కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేస్తోంది అధికారులు ఎంత ఖర్చు పెడుతున్నారు అవి ప్రజల ఆరోగ్య సంరక్షణకు సక్రమంగా వినియోగించుచు ఉన్నారా? కనీస సౌకర్యాల కల్పనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవా? అని చూడవలసిన జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు, మొక్కుబడిగా ప్రభుత్వ వైద్యశాల ను, సందర్శించి అన్ని బాగానే ఉన్నాయి. ఎంత మంది రోగుల కైనా వైద్యం అందించడానికి మా వద్ద అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయని మాటలు చెబుతున్నారే గాని నిజంగా అంత సామర్థ్యం ప్రభుత్వ వైద్యశాలకు ఉన్నదా? లేదా? అనే వాస్తవాలు పరిశీలించి విచారించక పోవటం వల్లనే ఒక నిండు ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి ఎవరు జవాబు చెప్పాలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక బాధ్యత చేపట్టవలసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ వైద్యశాల పై పర్యవేక్షణ లేదు అనే చెప్పాలా,వారు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే, ఇలాంటి మరణాలను ఇకపై చూడ బోము, ప్రజాసంఘాలు రాజకీయ నాయకులు అందరూ వైద్యశాల అవసరాలు లోపాల పై దృష్టి సారిస్తే తద్వారా మన ప్రజలను మనం రక్షించుకోగలము. లేదంటే ఇలాంటి మరణాలు ఎన్నో చూడవలసి ఉంటుంది.పేదవారికి ప్రభుత్వ వైద్యశాల ఉంది అనే నమ్మకాన్ని కలిగించాలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ ప్రాంత ప్రజలు అధికారులు రాజకీయ ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాల పై దృష్టి సారించి కనీస సౌకర్యాలను కల్పించే ఏర్పాట్లు చేయాలని, ఈ విధంగా మరో ప్రాణం పోకుండా కాపాడాలని జరిగిన మృతిపై విచారించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

About The Author