గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించండి.. ఎంఐఎం నేత ప్రతిపాదన

గోహత్యకు పాల్పడిన వారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని యోగీ సర్కార్ గోవధ నివారణ చట్టం 2020 పేరుతో కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఒక రోజు అనంతరం.. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) నాయకుడు సయ్యద్ అసిమ్ వకార్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆవులను సంరక్షించేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా ఓ ప్రణాళికను సిద్దం చేయాలని కోరారు. అంతేకాక వట్టిపోయిన ఆవులను అమ్మేవారిని జైలులో పెట్టడమే కాకుండా రూ. 20 లక్షల భారీ జరిమానా కూడా విధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆవులను కొనుగోలు చేసి గోశాలలలో పెట్టి సంరక్షించేలా నిబంధనలు అమలు చేయాలని వకార్ బీజేపీ ముఖ్యమంత్రులను కోరారు. ప్రస్తుతం ఆవులన్నీ కూడా రోడ్లపై తిరుగుతూ చెత్త చెదారం తింటున్నాయని.. అలాగే మురికి నీళ్లు తాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

About The Author