పాకిస్థాన్ మాజి ప్రధానికి కరోనా

మన దేశంలో లానే దాయాది పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. అక్కడ రాజకీయనేతల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని సహాయకుడికీ, ప్రధాని భార్యకు కరోనా అని తేలింది. ఇక ఇటీవల పీటీఐ, పీఎంఎల్ ఎన్ పార్టీల నేతల్లో చాలామంది కరోనా బారినపడ్డారు. ఇక ప్రధాన విపక్ష నేత, పీఎంఎల్ ఎన్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, రైల్వే మంత్రి షేక్ రషీద్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరారు. వారం క్రితం  పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు దృవీకరించడంతో ఆయన ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా ఈరోజు మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా కరోనా బారిన పడ్డారు. గిలానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ ప్రకటించారు. అలాగే కాసిమ్ పాక్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. “ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకి కృతజ్ఞతలు. మా నాన్న జీవితాన్ని మీరు విజయవంతంగా ప్రమాదంలోకి నెట్టగలిగారు. ఆయన కరోనా పరీక్ష పాజిటివ్ అని వచ్చింది” అంటూ ఆయన దెప్పి పొడిచారు.

About The Author