పెళ్లికొచ్చిన ప్రియుడిని చూసి సినిమా స్టయిల్లో కౌగిలింత..
తెలంగాణ:ఇదో విచిత్రం.. సినిమాలో తప్ప మీరెవరూ మరెక్కడాచూడని , వినని వింత ప్రేమకథ. ఓ యువతికి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగిన 24 గంటల్లో ప్రియుడితో రెండో వివాహం జరిగింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో శాబ్దులాపురానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన యువకుడితో పెద్దలు కుదిర్చిన పెళ్లి శుక్రవారం జరిగింది. అయితే వరుసకు మామ అయిన కొండభీమనపల్లికి చెందిన రాజేశ్, మౌనిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మౌనిక పెళ్లి అయిన కొద్దిసేపటికి ఆమె వద్దకు ప్రియుడు రాజేశ్ రాగా, ఆమె అతడిని పట్టుకుని ఏడ్చింది. ఇది చూసి కంగుతిన్న మౌనిక భర్త పంచాయితీ పెట్టాడు. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లిని రద్దు చేసుకుని వాళ్లు వెళ్లిపోయారు. కాగా, శనివారం మౌనిక–రాజేశ్లకు గుడిలో ఇరువురి బంధువుల సమక్షంలో ప్రేమపెళ్లి జరిపించారు.