నేడే ఉపచాయా చంద్రగ్రహణం…

మొన్ననే మనం సూర్యగ్రహణాన్ని చూశాం. ఇప్పుడు అతి ముఖ్యమైన చంద్రగ్రహణం రాబోతోంది.2020లో మనం ఇప్పటివరకూ రెండు చంద్రగ్రహణాలు… ఓ సూర్యగ్రహణం చూశాం. ఇక నాలుగో గ్రహణం… నేడు (జులై 5న) రాబోతోంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కనిపించదు. ప్రధానంగా ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఇది కనిపిస్తుంది. అలాగే యూరప్ దేశాలు, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపిస్తుంది.ఈసారి రాబోయే చంద్రగ్రహణాన్ని ఉపచాయా చంద్రగ్రహణం అంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం… గ్రహణాల్ని డైరెక్టుగా కళ్లతో చూడకూడదు. ఉపచాయా గ్రహణం రోజున… చందమామ… భూమి ఛాయ (నీడ)కు అవతలివైపు నుంచి కదులుతుంది. భూమి నీడ పడే ప్రాంతాన్ని అంబ్రా (Umbra) అంటారు. ఆ అంబ్రా నీడను దాటి చందమామ ఈసారి వెళ్తుంది.చంద్రగ్రహణం నాడు… సూర్యుడు… చందమామ మధ్యలో భూమి ఉంటుంది అందువల్ల సూర్యుడి కాంతి… చందమామపై పడదు. భూమి పక్కకు జరిగినప్పుడే తిరిగి కాంతి చంద్రుడిపై పడుతుంది. జులై 5న ఇలా జరగనుంది.ఈ చంద్రగ్రహణం సంభవించే సమయంలో… భారత్‌లో తెల్లవారు జాము ఉంటుంది. అందువల్ల ఇంది భారతీయులకు అస్సలు కనిపించదు. ఇది మొత్తం 2 గంటల 43 నిమిషాల 24 సెకంట్లపాటూ కొనసాగనుంది. భారతీయ కాలం ప్రకారం… చంద్రగ్రహణం నేటి ఉదయం 8.38కి మొదలవుతుంది. ఉదయం 9.59కి చందమామ పూర్తిగా కనిపించదు. ఉదయం 11.21కి గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.చంద్రగ్రహణం వల్ల అయితే మంచి, లేదా చెడు జరుగుతుందని జ్యోతిషులు చెబుతుంటారు. కొంత మందికి గ్రహణం కలిసొస్తుంది. కొంతమందికి కీడు జరుగుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది గ్రహణం సమయంలో ఏమీ తినరు. ఉపవాసం ఉంటారు. గ్రహణం సమయంలో ఆహారం తింటే… సూర్యుడు, చందమామ, భూమి ఆకర్షణ, వికర్షణ బలాల వల్ల కడుపులో ఆహారం సరిగా జీర్ణం కాదనే అభిప్రాయం ఉంది.సైంటిస్టులు మాత్రం గ్రహణానికీ… ఆహారం తినడానికీ సంబంధం లేదంటున్నారు. ఈ గ్రహణాలు అనేవి సహజంగా ఏర్పడేవేననీ, వీటిని చూపిస్తూ… లేనిపోని ప్రచారాలు చేయవద్దని కోరుతున్నారు. ఈసారి గ్రహణాన్ని చూసేందుకు నాసా శాస్త్రవేత్తలు సహా… అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల ప్రజలు సిద్దమవుతున్నారు.

About The Author