కేన్సర్ నిరోధానికి యోగా కూడా మంచిదే…
కేన్సర్ నిరోధానికి యోగా కూడా మంచిదే…
పురుషులూ లైంగిక వేధింపుల బాధితులే..
మహిళలే కాదు, పురుషులూ లైంగిక వేధింపులకు గురవుతున్నారని నటి గౌతమి పేర్కొన్నారు. కేన్సర్ బారి నుంచి బయటపడిన అతి కొద్ది మందిలో ఈమె ఒకరు. కోవిల్ పట్టిలో ఆదివారం జరిగిన కేన్సర్‌పై అవగాహన, యోగా శిక్షణ శిబిరం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటి గౌతమి మాట్లాడుతూ కేన్సర్ వ్యాధి కారణంగా తనకు పలు సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. వైద్య చికిత్స పొందిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయ్యిందన్నారు. శరీరం పూర్తిగా కట్టుబాటులోకి రావడానికి యోగా బాగా పని చేసిందని చెప్పారు. కేన్సర్ సోకిన విషయాన్ని బయట పెట్టకపోవడం, ఆ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వంటివి శ్రేయస్కరం కాదన్నారు.
అలా చేస్తే ప్రాణానికే కాకుండా, కుటుంబానికే హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం సినిమా పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లోనూ లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయన్నారు. లైంగిక వేధింపులు మహిళలకే కాకుండా, మగవారు, పిల్లలు, పెద్దలు అంటూ అందరూ పలు విధాలుగా ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి విషయాల్లో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే విధంగా ఇటీవల నిర్మాతల మండలి వ్యవహారం రచ్చరచ్చగా మారిందని, అయితే ఆ సమస్యను వారే పరిష్కరించుకుంటారని నటి గౌతమి అన్నారు.