వినూత్నంగ శవయాత్రను నిర్వహిస్తున్న మహిళా జెఏసి నాయకురాలు


ప్రదర్శనలు చేసి, కొబ్బరికాయ కొడుతున్న మహిళా జేఏసి సభ్యులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శవయాత్రను నిర్వహించిన మహిళా జెఏసి

– 5 కోట్ల జనాభాకి 3 రాజధానులు అవసరమా?
– ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దు
– ప్రశ్నిస్థానన్న పవన్ కల్యాణ్ ప్రశ్నగానే మిగిలిపోయారు
– ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా
– అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి నాయకురాలు

రాష్ట్ర వికేంద్రీకరణ తరువాత అభివృద్ధి జాడ కనిపించలేదని రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న రాజధానిని తీసుకువెళ్ళి 3 రాజధానులు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం అని, 5కోట్ల జనాభ 13 జిల్లాలు ఉన్న ప్రాంతానికి 3 రాజధానులు అవసరామని జెఏసీ నాయుకురాలు, సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ రాష్ట్ర జెఏసీ కార్యాలయంలో వినూత్నంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శవ యాత్రను నిర్వహించి తమ నిరసనను తెలిపారు.

నిరసనలో భాగంగా పాడి పైన ప్రభుత్వ శవాన్ని మోసుకుంటూ ఖననం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. “రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసావు నాయనా.. భూములు ఇచ్చే రైతులను నిలువునా ముంచావు నాయనా.. అన్నదమ్ములు మధ్య విభేదాలు సృష్టించావు నాయనా.. జై అమరావతి.. జై జై అమరావతి.. సాధిస్తాము.. సాధిస్తాము.. అమరావతి సాధిస్తాము.. ఆంధ్రుల రాజధాని అమరావతి” అని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న విషయం మొదటి నుండి తమకు ఉన్న అనుమానం నిజమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమని, మా భవిష్యత్తు ఎంటి, రాజధాని అభివృద్ధి జరగకపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటి పడుతుంది,
పిల్లల భవిషత్తు ఎంటి అని మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని 3 రాజధానులు కేవలం ఆంధ్రరాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపి ఇప్పటికైన ద్వంద వైఖరిని వదిలి రాజధాని పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, రాజధాని రైతులకు మహిళ జేఏసీ అండగా ఉ ంటుందని తెలిపారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి గానే ఉండాలని ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విభజన బిల్లులో ఏవైతో హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకురాలు సుంకరపద్మశ్రీ మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై గవర్నర్ ద్వారా తీసుకున్న నిర్ణయంపై శవయాత్ర ద్వారా తమ నిరసనను తెలిపామన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నగానే మిగిలిపోయారని ఆరోపిచంఆరు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం పోరాటం చేసేవారు పెయిడ్ ఆర్టిస్టు అని ఉ ండవల్లి శ్రీదేవి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఉండవల్లి శ్రీదేవి ఇంటిని ముట్టడించడానికి వెళ్లే విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే అతనిని విడిచిపెట్టాలని డిమాండ్ చేసారు.

తెదేపా నాయకురాలు గద్దె అనూరాధ మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా అని ప్రశ్నించారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జెఏసి తరుపున న్యాయపోరాటం జరగుతుందని తెలిపారు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి చంపారు అని, అమరావతిని సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతినే ఉండాలని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గతంలో ఆమోదించారు కాబట్టే రైతులు వారి భూములను ప్రభుత్వంకు అప్పగించారన్నారని గుర్తుచేసారు.

నిరసనలో మహిళా జెఏసీ సభ్యులు పెనుమత్స దుర్గా భవానీ, యార్లగడ్డ సుచిత్ర, నార్ల మాలతి, సుభ, బొప్పన నీరజ దోనేపూడ రమ తదితరులు పాల్గొన్నారు.

About The Author