రైతు బంధు పథకం అమలు పై అధ్యయనానికి జార్ఖండ్ రాష్ర్టం

తెలంగాణ రాష్ట్రంలో రైతుల పాలిట కల్పవృక్షమైన “రైతు బంధు” పథకం అమలు పై అధ్యయనానికి జార్ఖండ్ రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారుల బృందం రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ బృందంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీ మంజునాధ బజంత్రీ ,వ్యవసాయశాఖ డైరెక్టరు శ్రీ రమేశ్ గోలప్ ,శ్రీ ఆంజనేయులు ,డిప్యూటీ కమీషనరు ధన్ బాద్,శ్రీ రవిశంకర్ శుక్ల , డిప్యూటీ కమీషనరు హజరీబాగ్ ,శ్రీ ప్రదీప్ కుమార్,స్పెషల్ సెక్రెటరీ వ్యవసాయశాఖ జార్ఖండ్ ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం డి బ్లాకు సమావేశ మందిరం నందు వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలైన రైతుబంధు , రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు,మార్కెటింగ్,ఉచిత నిరంతర విద్యుత్,మైక్రో ఇరిగేషన్,రుణమాఫీ మరియు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించడం జరిగింది. రైతుబంధు పథకం రైతులకు సామాజిక భద్రత,ఆర్థిక మరియు కుటుంబ శ్రేయస్సుకు రైతులలో వ్యవసాయం పట్ల మక్కువ పెంచడానికి ఎంతో దోహద పడుతుందని కొనియాడారు.

About The Author