సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేత…


??లాక్ డౌన్ ‌ఆంక్షలన్నీ ఎత్తివేత
??కరోనాతో సహజీవనం తప్పదు
??కరోనా ప్రభావం మందగించింది
??రికవరీ రేటు పెరిగింది
??సినిమా హాళ్ల,మాల్స్‌ అన్నీ తెరవచ్చు
??ఇకపై కరోనా రోగం ఓ వ్యాధే
??రక్షించుకునే బాధ్యత ప్రజలదే
??వైరస్‌ సోకితే కుటుంబ సభ్యులకు ప్రమాదం
??ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలి
??పాజిటివ్‌గా మారితే వైద్యం మాత్రం ఉచితం
??పరిశ్రమల్లో కార్మికుల రక్షణ యాజమాన్యాలదే అవసరమైతే కార్మిక చట్టాల్లో మార్పులు
??స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలదే నిర్ణయం
??సమాయత్తమవుతున్న కేంద్రం

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణంటూ కేంద్రం నడుంకడుతోంది. ఇందుకోసం లాక్‌డౌన్‌ ఆంక్షలన్నింటినీ ఈనెలాఖరుతో ఉపసంహరించేందుకు సమాయత్తమౌతోంది. సెప్టెంబర్‌ 1 నుంచి సాధారణ జనజీవితం కొనసాగాలని భావిస్తోంది

కోవిడ్‌–19కు సంబంధించి ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలెట్టింది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక ఏర్పడనుంది. ప్రజలకే ఈ బాధ్యతను బదలాయించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. రోగులకు వైద్యం తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ సెప్టెంబర్‌ 1 తర్వాత ప్రభుత్వాలు తలదూర్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెలాఖరుతో అన్ని నిబంధనలు ఉపసంహరించబడితే విద్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్లు.. ఇలా ఒకటేమిటి అన్నీ తిరిగి ప్రారంభమయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది
ఇకముందు కరోనాను ప్రభుత్వాలు ఒక వ్యాధిగానే పరిగణించాలన్న నిర్ణయానికొచ్చేశాయి. ఇతర వ్యాధుల తరహాలోనే దీన్ని కూడా చూస్తాయి. ఈ వ్యాధి సోకకుండా రక్షించుకునే బాధ్యత ఇక ప్రజలదే. వ్యాధిగ్రస్తులైతే అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకే తొలి ప్రమాదం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు నిబంధనల్ని తమంత తాము రూపొందించుకుని అమలు చేయాలి. వ్యాధిగ్రస్తులన్న సందేహమొస్తే ప్రభుత్వ వైద్యశాలకెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యం మాత్రం ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది.
కోవిడ్‌-19 పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృక్పథాలు మారుతున్నాయి. కోవిడ్‌తో సహ జీవనం తప్పదన్న నిర్ణయానికొచ్చేశాయి. దేశంలో కోవిడ్‌ ప్రబలిన తొలినాళ్ళలోనే దీని నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిం చింది. వేగంగా స్పందించింది. మూడు విడతలుగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అనంతరం అంచెలంచెలుగా లాక్‌డౌన్‌ల ఉపసంహరణ మొదలెట్టింది. అయితే మార్చి 24న మొదలైన లాక్‌డౌన్‌ల ప్రక్రియ సడలింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఆరుమాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఉత్పాదకత పడిపోయింది. వ్యాపారాలు నిర్వీర్యమయ్యాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. బ్యాంకింగ్‌ నుంచి అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అభివృద్ధి నిలిచిపోయింది. సంక్షేమానికి కొంతమేర నిధులందాయి. ఇదే పరిస్థితి మరికొన్నాళ్ళు సాగితే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం కనిపిస్తోంది.
కోవిడ్‌ కేసుల నియంత్రణకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిం చాయి. రోగ అనుమానితుల్ని గుర్తించడం నుంచి వారికి పరీక్షలు నిర్వహించడం, రోగ గ్రస్తులతో మాట్లాడిన లేక కలిసిన వారందరినీ వెదికిపట్టుకోవడం, వారందరికీ రోగ నిర్ధారణ పరీక్షలుచేయడం, రోగగ్రస్తుల నివాసాల పరిస రాల్ని కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించడం, వాటి నిర్వహణా బాధ్యతల్ని చేపట్టడం రోగ గ్రస్తులకు మందుల నుంచి వైద్య సదుపాయా లన్నీ ఉచితంగా కల్పించడం మరోవైపు అను మానితుల్ని రెండువారాల పాటు క్వారంటైన్‌ సెంటర్లకు పంపించడం అక్కడ ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఆహార, వైద్య సదుపాయాలు అందించడం ఇలా అన్నింటిని ప్రభుత్వాలే తమ భుజాలపై వేసుకున్నాయి. ఇందుకోసం మొత్తం యంత్రాంగాన్ని సమర్ధవంతంగా వినియోగించాయి.
ఇదిలావుంటే లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద, మధ్యతరగతి ప్రజలందరికీ జాతీయ ఆహార భద్రతా పథకాన్ని విస్తరించాయి. ఇప్పటికే 9విడతలుగా ఉచితంగా బియ్యం, పప్పు దినుసులు అందించాయి. ఈ క్రమంలో జనం ఇళ్ళకే పరిమితం కావడంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ఆర్థిక వృద్ధి నిల్చిపోయింది.
ఇప్పటికే ఆరు మాసాలు కావడం, దేశంలో కరోనా విస్తృతి తగ్గకపోయినప్పటికీ కోవిడ్‌-19 ప్రభావం మందగించడం, రోగగ్రస్తుల రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం వంటి కారణాల నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుతో లాక్‌డౌన్‌ ప్రక్రియను పూర్తిగా ఎత్తేయాలని కేంద్రం భావిస్తోంది. అనంతరం కూడా నిషేధాజ్ఞలు కొనసాగించాలన్న ఆలోచన రాష్ట్రాలకుంటే ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కోవిడ్‌ పరిస్థితుల్ని బట్టి నిర్ణయాల్ని తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించేందుకు కేంద్రం సమాయత్తమౌతోంది.
దీంతో సెప్టెంబర్‌ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ తెరుచుకోనున్నాయి. సినిమా థియేటర్లు మొదలుకానున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, కళ్యాణమండపాలు, రైల్వేస్టేషన్లన్నీ పూర్తిగా తెరుచుకోనున్నాయి. రైళ్ళు అంచెలంచెలుగా ప్రయాణం ప్రారంభించనున్నాయి.
గత ఆరుమాసాలుగా దేశంలోని 130 కోట్ల మందిని రక్షించే బాధ్యతను ప్రభుత్వాలు తలకెత్తుకున్నాయి. ఇందుకోసం నిబంధనలు, నిషేధాజ్ఞలు విధించాయి. కట్టడి చేసేందుకు పోలీసు బలగాల్ని వినియోగించాయి. అయినప్పటికీ జనంలో ఎలాంటి క్రమశిక్షణ అలవడలేదు. నిబంధనలు పాటించాలన్న చైతన్యం రాలేదు. రోజురోజుకు కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు. అయితే రోగప్రభావం తగ్గేందుకు ప్రకృతి సిద్ధ కారణాలే తప్ప ప్రజల చైతన్యం ఏమాత్రం కారణం కాదు. ఇదిలా ఉంటే ఆరుమాసాలుగా కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వారికి దీని కట్టడిపై నెమ్మదిగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే రోగగ్రస్తులకు అవసరమైన మందులు అంచెలంచెలుగా అందుబాటులోకొస్తున్నాయి. మరోవైపు రోగం రాకుండా కట్టడి చేయగలిగే టీకాలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి ఎర్రకోట ప్రసంగంలో వెల్లడించారు. మొత్తం 130కోట్ల భారతీయులకు ఈ టీకాలేస్తామని హామీనిచ్చారు. దీంతో ఇక కరోనా నుంచి రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తిపైన పడింది. తమ కుటుంబ సభ్యులు, సహచరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర రోగాల తరహాలోనే ప్రభుత్వాస్పత్రిలో దీనికి వైద్యం లభిస్తుంది. ఇక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు యదావిధిగా పనులు ప్రారంభించొచ్చు. అయితే వీటిలో పని చేసే కార్మికులకు కరోనా నుంచి రక్షణ చర్యల్ని మాత్రం ఆయా సంస్థల యాజమాన్యాలే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైతే కార్మిక చట్టంలో సవరణలకు కూడా కేంద్రం సిద్దపడుతోంది.

About The Author