హిందువుల దెబ్బకి తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాట మార్చిన వైవీ సుబ్బారెడ్డి


తిరుమల : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై పలు సంఘాలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున తప్పుబట్టారు. దీంతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ డిక్లరేషన్ వివాదంపై మరోసారి వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
మరోసారి క్లారిటీ..
‘సోనియా గాంధీ, వైఎస్ఆర్ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో డిక్లరేషన్‌పై సంతకం చెయ్యలేదు. ఈ నెల 23వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్‌పై సంతకం చెయ్యరని చెప్పాను. హిందువేతరులు ఎవరైనా డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉంది. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరు డిక్లరేషన్‌పై సంతకం చెయ్యడం లేదు. గుర్తించిన భక్తుల నుంచి మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జగన్ గతంలో పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. దయచేసి నా మాటలను వక్రీకరించకండి’ అని వైవీ సుబ్బారెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చుకున్నారు.
#రాష్ట్రీయశివాజీసేన

About The Author