డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి సీఎం జగన్…


తిరుమల: వివాదాల మధ్య సీఎం జగన్ తిరుమల పర్యటన జరుగుతోంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే *డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి జగన్‌ ప్రవేశించారు.* అనంతరం శ్రీవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. *సంప్రదాయ వస్త్రధారణతో జగన్ నుదుట నామాలు పెట్టుకున్నారు.* బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన మలయప్పస్వామి భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిచ్చాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నారు.

About The Author