ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో …

ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని; రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని; రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల జరిగే లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని; రైతులను సంఘటిత పరచటం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని; రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంటల కాలనీగా విభజించాలని; రైతు పండించే ప్రతి పంటకు డిమాండ్ లభించేలా చూడాలని; రాష్ట్రంలో నెలకొల్పబోయే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వ పరంగా నమ్మకమైన, కల్తీరహిత బ్రాండెడ్ ఉత్పత్తులు జరగాలని; రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల మీద కోట్లాదిమంది అధారపడి వున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని, దేశం మొత్తంలోనే ఉత్తమమైన వ్యవసాయ, ఉద్యానవన, పుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులలో తెలంగాణ అగ్రభాగన వుండాలని సీఎం అన్నారు. రైతులను ఆదుకునే విషయంలోయావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చెప్పారు.

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంభించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులలో భాగస్వాములను చేయటంపై, తెలంగాణలోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు శ్రీ రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎంఒ అధికారులు శ్రీ నర్సింగ్ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి స్మితాసభర్వాల్, డిజీపి శ్రీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు శ్రీ అనురాగ్ శర్మ, మాజీ మంత్రి శ్రీ చెరుకు ముత్యం రెడ్డి, టిఎస్ఐఐసి చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మహేశ్వర్ రెడ్డి, శ్రీ ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

‘‘ఈ సమీక్షా సమావేశం పుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన అంశాలపై ఒక అవగాహనకు రావటానికి ఏర్పాటయింది. దురదృష్టవశాత్తు చాలా విషయాల్లో సరైన గణాంకాలు లేకపోవటంవల్ల, సరైన నిర్ణయానికి రావటం కష్టమమతున్నది. ఈ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండుతుంది, ఎంతమేరకు పండ్ల ఉత్పత్తి జరుగుతున్నది, ఏ మేరకు ప్రజల ఆహార అవసరాలు తీరుతున్నవి? అనే విషయాలపై సరైన గణాంకాలు ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, సంబంధిత ఇతర శాఖలు ఒకదానికి ఒకటి సంబంధ అనుబంధంగా పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి. దీనికొరకు ఎమి చేయాలో ఆలోచించాలి. దీని ద్వారా రైతుల్లో అశాంతి పూర్తిగా తొలిగిపోతుంది. దీనికి మొదటి అడుగుగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగింది. వాళ్లకు క్రమపద్ధతిలో శిక్షణనివ్వాలి. తరువాత వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగింది. భూమి లెక్కలు కూడా తేల్చటం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంతుందో తేలింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. ఇదంతా ఒక గొలుసుకట్టు కార్యక్రమంలాగా జరిగితే తద్వారా వ్యవస్థ బాగుపడితే చాలామంచిది’’ అని సీఎం అన్నారు.

‘‘రైతులందరూ ఒకే రకమైన పంట వేస్తే సమస్యలు తలెత్తుతాయి కనుక పంట మార్పిడి కొరకు వాళ్లకు అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంత మార్పు రావాలి. అందరూ రైతులు ఒకే రకమైన పంట వేస్తే జరిగే లాభ నష్టాల మీద చర్చ జరగాలి. ముల్కనూరు గ్రామం అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించడం జరిగింది. రైతులకు పలనా విధంగా నడుచుకుంటే లాభం కలుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు నమ్మకం కలిగించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాటిని ఢిల్లీలో కలిసి ఈ విషయాలలో వర్క్ షాప్ నిర్వహించాలని మన రాష్ట్రానికి ఆహ్వానించాను. త్వరలో ఆయన మన రాష్ట్రానికి వస్తారు’’ అని చెప్పారు సీఎం.

‘‘రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్ ఉండాలె. మన ఆహార అవసరాలేంటో తెలుసుకోవాలె. రైతాంగం ఏ పంటలు వేయడానికి అలవాటు పడ్డదో అర్థం చేసుకుని ఒకే సారి వాళ్లమీద మన అభిప్రాయాలను రుద్దకుండా అంచలంచలుగా పంట కాలనీల విషయంలో అవగాహన కలిగించాలె. గ్రామీణ ఆహార అవసరాలతో పాటు, నగర-పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగు విధంగా ఉత్పత్తులు జరగాలె. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర లాంటివి కూడా దిగుమతులు చేసుకోవడం దురదృష్టం. నగరాల-పట్టణాల దరిదాపుల్లో కూరగాయల పెంపకం జరగాలె. వచ్చే వానకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయి కోటి ఎకరాలకు పైగా సాగునీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలె’’ అని అన్నారు సీఎం.

‘‘ఎటువంటి రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్ చేస్తే దాని ధర పెరుగుతుంది. ఉదాహరణకు మిరపకాయ నుండి కారంపొడి లేదా పసుపు కొమ్ముల నుండి పసుపు తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు కొనాలన్నా కల్తీ అవుతున్నది. మనం గనక మార్కెట్లో ఒక బ్రాండ్ నేమ్ మన పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు అదీ ప్రభుత్వ పరంగా తయారైన వస్తువన్న నమ్మకం కలిగించాలె. దీనికొరకు పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించాలె. మన ఆలోచనలను కార్యరూపంలో తీసుకుని వచ్చి అమలు పరచాలె. ఏ ప్రాంతంలో ఎన్ని పుడ్ ప్రాసెసింగ్, ఏ రకమైన పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వుండాలో నిర్ణయించాలె. మన రాష్ట్ర అవసరాలకు సరిపోను మిగిలినవి పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలె. ఈ యావత్ ప్రక్రియలో ఐకెపి-మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి. ఏ మేరకు వీరిని భాగస్వాములను చేయవచ్చో అధ్యయనం చేయాలె. 130 కోట్ల ప్రజలున్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్. ఏ రాష్ట్రంలో ఏది పండదో దాన్ని విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాటిని పండించగలగాలె. తద్వారా పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను తయారు చేయాలె. దేశ విదేశాల్లో అత్యుత్తమమైన పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే విషయం అధ్యయనం చేయాలె’’ అని చెప్పారు సీఎం.

‘‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలవాలె. మంచి మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలె. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణమైన పరిశోధనలు జరగాలె. అంతర్జాతీయ విపణిలో మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో వుండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించటానికి ప్రయత్నం జరగాలె. ప్రతి గ్రామం ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలె. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు-పట్టణాలకు సరఫరా చేయాలె’’ అని సీఎం అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగు సంవత్సరాల్లో సగటున 17.17 శాతం వృద్ధిరేటును సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్ధిరేటు వుందని, జీఎస్డిపీలో ప్రథమ స్థానంలో వున్నామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాల మన పెరుగుదలకు అవకాశాలున్నాయని, అందుకే మూస పద్ధతిలో ఆలోచించకుండా నూతన వరవడికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో జరిగిన చర్చల ప్రాతిపధికగా ఆలోచనలు పంచుకుని ఎలా ముందుకు పోవాలో నిర్ణయించాలని అధికారులను కోరారు.

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాపటు పలువురని ఇందులో భాగస్వాములను చేయాలని సీఎం చెప్పారు. తొలుత ఒక ఆరేడు మండలాలను పైలట్ పద్ధతిన తీసుకుని కార్యక్రమం ప్రారంభించాలని, ఆ తరువాత పెద్ద ఎత్తున ప్రారంభించొచ్చని సీఎం చెప్పారు. ఈరోజు జరిగిన సమీక్ష ఆధారంగా అధికారులు వివిధ స్థాయిల్లో మేధో మదన కార్యక్రమాలను, వర్క్ షాపులను నిర్వహించాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరంగా పుడ్ ప్రాసెసింగ్ లో అమలు పరుస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, అలానే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదని, ఉత్తమ స్థాయి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన పూర్వ రంగంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అధ్యయనం చేసి రావొచ్చని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 45 లక్షల మంది సభ్యులున్న 4 లక్షలకు పైగా ఐకేపి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చెప్పారు.

పంట కాలనీల ఏర్పాటు, విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు విరివిగా అందుబాటులో వుంచడం, అవసరమైన ఎరువులు, క్రిమిసంహరక మందులు అందుబాటులో వుంచడం జరగాలని చెప్పారు ముఖ్యమంత్రి. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు.

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao said, that, there is a need to overcome the difficulties arising out of non-availability of appropriate statistical data pertaining to food and agriculture sector; there is a need for effecting change in certain traditional habits of farmers to some extent; study the advantages and disadvantages of every farmer preferring same crop; greater results could be achieved if a farmer is brought into organised sector; the state needs to be divided into crop colonies, the entire crop produced by farmer shall be sold on demand; through the food processing units proposed to be established by the state government branded unadulterated products should come out and farmer should prefer a crop in a regulated manner. The CM said, that, crores of people are dependent on agriculture and horticulture in the state and hence these two departments should work to fulfill the needs and aspiration of them. The CM further said, that, in agriculture, horticulture, food processing and in exports of processed food products Telangana should be on top among all other states in the country. The CM said that Telangana stands first in the country and is a role model for the cause of farmer.

The CM held a high-level review meeting in Pragathi Bhavan on Monday afternoon on various aspects of the food processing industry, the process to follow in future in establishing them, involving IKP-women groups in the food processing industry and exporting different types of agriproducts to other states and countries.

Chief Advisor to Government Sri Rajiv Sharma, Advisor Sri Anurag Sharma, Chief Secretary Sri SK. Joshi, CMO officers Sri S. Narsing Rao, Ms. Smita Sabharwal, Principal Secretary of Finance Sri Rama Krishna Rao, Principal Secretary for Agriculture Sri Parthasarathy, Principal Secretary for Industries Sri Jayesh Ranjan, DGP Sri Mahender Reddy, TSIIC Chairman Sri Bala Mallu Whip Sri Palla Rajeshwar Reddy, MLC Sri Srinivas Reddy, Former Minister Sri Cheruku Muthyam Reddy, MLAs Sri Maheswar Reddy, Anand and agriculture and horticulture officers.

“This meeting is basically not for taking a decision right now across the table but only to come to an understanding on issues connected to food processing. Unfortunately, in the absence of appropriate statistical data, it is becoming difficult to take decisions. We need data on the amount of rice produced, fruits produced, domestic food needs of people etc. If only agriculture, horticulture and other connected departments were hand in hand then only we will get good results. We need to think as to what to be done for this. Dissatisfaction in any in the farmers will be totally done away when this happens as the first step towards this Rythu Samanvaya Samithis has been formed. The member needs to be trained now. The agriculture extension officers have also been recruited. Rectification and purification of land records have been done and the extent of agriculture land is identified now we need to ensure minimum support price for the agriculture product. All this is a cycle and chain process and if the institutions are improved through this there is nothing like that” said the CM.

“if every farmer prefers the similar crop then there are problems. The farmer needs to be educated against this. They need to be a change in certain traditional habits of a farmer there need to be experienced sharing on the advantages and disadvantages of every farmer preferring the similar crop. The experience of Mulkanuru village should be emulated. They are through a cooperative model and through bringing the farmer into organised sector excellent results were achieved. If we can create confidence in the farmer for which we should take a pledge that they would be benefitted if they change their mindset it would give excellent results. I met agriculture economist Ashok Gulati in my recent visit to Delhi and invited them to the state to conduct a workshop on these issues for which he has agreed and will be visiting the state shortly” said the CM.

“The state shall be divided definitely into various crop colonies, the entire crop produced by farmer shall be sold on demand. We need to know our domestic food needs. After understanding the mind of the farmer about the preference of a particular crop, instead of bringing pressure on him we should educate him to go for an alternate crop phase wise. Agri products should be in tune with village needs as well as the needs of the town and the cities. It is unfortunate that we import from mother states vegetables even products like Coriander leaves (Kothimeera) and Cumin (Jeera). We should grow vegetable in the urban agglomeration by next rainy season we get water from Kaleshwaram Project through which additional ayacut will come under cultivation. In the next two years, most of the irrigation project will be completed bringing more than a crore of acres under cultivation. Groundwater levels will be increased. The tanks will be filled with water, against this background the farmers are to be educated about the appropriate crop which he should prefer “said the CM. Any agriculture product will get more price only with value addition through food processing like powder from mirchi. In these days every product is being adulterated if we can establish a brand name to products produced through government-sponsored food processing units and create confidence among the buyers then it will give good results. For this, we need to establish food processing industries. We should translate our ideas into action and execute them. We need to decide has to how many food processing units are to be started in a particular area as well as the number of such units. The products after consumed for the domestic needs are to be exported to other states and countries in this entire process the IKP-women group members are to be involved. We need to study to what extent they can be involved. Our country with 130 crore people with a big domestic market and we should make proper use of it. After deciding has to which crop is not produced in a particular state and analysing the results, we should be able to grow it in our state subject to the climatic conditions. By this, the for-processing products are to be produced. We should also study the best practices in food processing industry of other states and abroad establish so that we may adopt the suiting the climatic conditions of the state.

“We should take care that farmers prefer a particular crop in a regulated manner. The agriculture department should know as to what seed is sowed in every inch of land. Quality seeds are to be supplied to the farmer. There should be terrific research in the agriculture university, it is unfortunate that in the international market there is not enough of demand for Indian agriculture products. Efforts are to be made to overcome this. Every village shall produce the vegetables required for that village. This culture has to be promoted. The surplus to be supplied to the urban areas” said the CM.

The CM said that the state economic growth is excellent and has been registering consistently on an average 17.01% growth rate during the last four years. He said this financial year so far, the state own tax revenue growth rate registered 29.97%. He said we are also number one in the country in the GSDP. The CM said that during the next five years the government would spend Rs 10 lakh crore and hence we should grow more. The CM told the officers that we should start thinking out of box way and obtain better results. He said that against the background of today’s discussion the officers should move forward and share the ideas, best practices and then arrive at a decision.

The CM said that food processing should be a combined effort in which IKP- women group members and others are to be involved and should be engaged in the positive line. The CM suggested that to begin with, 6 to 7 Mandals are to be taken as a pilot and a make a success story by involving all the stakeholders like IKP groups. He said that today’s proposed agenda to be followed by big brainstorming and series of workshops. The CM said that the officers should also study all the schemes on food processing at the government of India level as well as try to download some international best practices and experiences. The CM said that the government is ready to spend any amount of money for learning. For successful food processing units to be started, the CM told the officers to go to any part of the world for learning the best practices. He suggested that the 45 lakh members of IKP belonging to 4.1 lakh groups should be given vigorous training, to begin with.

CM suggested to establishing crop colonies, regulating seed companies, prohibit the sale of spurious seeds, make available seeds, fertilizers and pesticides. CM said to develop an action plan to provide plantation machines, weeding machines, machines for turmeric farmers. In the backdrop of the discussion held in the review meeting, it is decided to prepare an action plan on food processing. The CM described it as a beginning of a revolution in food processing and let us make it a success.

About The Author