యాదాద్రిలో శివాలయం ప్రహరీకి నంది విగ్రహాలు..


యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం / శివాలయం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు శివాలయం ముఖమండపం ఎదుట ధ్వజ స్తంభానికి వెనుక వైపు ఉన్న ఆవరణలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేలా శివాలయ ప్రధానాలయం ముఖమండపం చుట్టూ ఉన్న పిలర్ల మధ్యలో ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం శివాలయం చుట్టూ ప్రహరీ పై నంది విగ్రహాలను అమర్చే పనులు ఊపందుకున్నాయి. ప్రహరీ చుట్టూ మొత్తం 32 నంది విగ్రహాలు, దక్షిణవైపు ప్రహరీకి 17, ఉత్తరం వైపు 15 నందులను అమరుస్తున్నారు..

About The Author