ఈ ఫొటోలో ఉన్న ఆవిడ పేరు ఫూల్వతి దేవి, వయస్సు 73 ఆవిడ తన 20 వ ఏట భర్తను పోగొట్టుకుంది. ఈమె శ్రీ కృష్ణుని భక్తురాలు. మధ్యప్రదేశ్‌లోని కాట్ని పట్టణానికి చెందిన ఈమె తన భర్త మరియు కుమార్తె మరణించిన ఐదు సంవత్సరాల తరువాత 1982 లో మధురకు వచ్చారు. అప్పటినుండి గేట్ నెం 2లో అక్కడికి వచ్చే భక్తుల చెప్పులను చూసుకునే బాధ్యత తీసుకుంది. గడిచిన 50 సంవత్సరాలలో వారు ఇచ్చిన డబ్బులు కూడ బెట్టింది.
అవి ఇప్పుడు అక్షరాలా 51 లక్షల రెండు వేల యాభై రూపాయలు.
ఆ డబ్బులు తన స్వంతానికి వాడుకోకుందా శ్రీ కృష్ణుని ఆలయం లో గోశాల కట్టడానికి 40 లక్షలు ఇచ్చింది. మిగతా 11 లక్షలు భక్తుల కోసం ధర్మశాల కు ఇచ్చింది. ఈమె ఈ డబ్బు ఇచ్చిన సంగతి చాలా గోప్యంగా ఉంచింది.
తన కుటుంబం గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఫూల్వతి దేవి “నాకు శ్రీకృష్ణుడితో మాత్రమే అనుబంధం ఉంది మరియు మరెవరూ లేరు, అందుకే నేను ప్రభువు సేవ ఉన్నదానిని ఇచ్చాను”. ఆమెకు కాట్నిలో పట్టణంలో కొడుకు ఉన్నారని, కొన్నిసార్లు ఆమె అతన్ని చూసొస్తుందని, కానీ అతనితో కలిసి ఉండాలని లేదని కృష్ణుని సేవలోనే తనకు ఆనందం అంటోంది.
“నేను నా జీవితాంతం శాంతియుతంగా గడపాలని కోరుకుంటున్నాను, ఠాకూర్ జి (కృష్ణ) కి సేవ చేస్తున్నాను”
“ఈమె తన వద్ద ఉన్నవి, ఆమెకు ఏమైనా విరాళాలు వచ్చినా, ఆమె దానిని ఆలయంలో ఆచారాలు చేయడానికి ఖర్చు చేస్తుంది లేదా అవసరమైన వారికి ఇస్తుంది. ” క్రమం తప్పకుండా పేదల కోసం ‘భండారాలు’ నిర్వహిస్తుందని, వారికి ఆహారాన్ని అందిస్తుందని అక్కడున్నవారు చెప్తుంటారు.
శ్రీ కృష్ణుడు అంటే అపార మైన భక్తి కలిగిన ఈమె పేరు ఫూల్వతి దేవి!
అమ్మా! నీ జన్మ ధన్యం! ఎందరికో నీవు స్ఫూర్తిని ఇచ్చావు.
? జై శ్రీ కృష్ణ ? కృష్ణం వందే జగద్గురుమ్ ?

About The Author