మనకు తల్లి ఎలాగో, ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కూడా తల్లితో సమానం.. మధుసూదన్ రెడ్డి.


ఈ నాడు 25 ఏళ్ల రైతుల కష్టం తీరిన వేలని రైతుల కల నెరవేరిన వేలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. రైతుల శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం, చియ్యవరం పంచాయతీ లో గల 2 వేల ఎకరాల పొలాలకు తెలుగు గంగ కాలువ నీటి సౌకర్యం లేక గత 25 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడ్డారు. గత పాలకులకు అనేక సార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకో పోకపోవడంతో నిరాశ చెందారు.అయితే రైతులకు గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు గెలిచిన ఒక సంవత్సరంలోనే సుమారు 26లక్షల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేసి తెలుగుగంగా నీటితో చీయవరం చెరువు పూర్తిగా నిండి రెండో పంట కూడా పండించుకునే అంతా నీటిని నిల్వ చేసే కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ,మనకు తల్లి ఎలాగో ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కూడా తల్లితో సమానం అని అన్నారు. దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది గాని ఆహారానికి రైతుకి ప్రత్యామ్నాయం లేదన్నారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలుగు గంగ నీటిని మీ చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేలా చేస్తా అని హామీ ఇస్తే కొందరు వెటకారంగా మాట్లాడారు.అయితే నాపై నమ్మకంతో 40 వేల ఓట్లు మెజార్టీతో గెలిపించి నాకు ఎమ్మెల్యే భిక్షపెట్టిన రైతన్న రుణం తీర్చుకోవడం కోసం ఈ ఒకటిన్నర సంవత్సరం లోనే తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి చెరువు, మల్లిగుంట,మామిడిగుంట,రాంభట్ల పల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించాము.అలాగే ఈరోజు చియ్యవరం పంచాయితీ లో సుమారు 26లక్షల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
శివుని తల నుండి వచ్చిన గంగలాగ రైతు కష్టాలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నాకు ప్రారంభించే అవకాశం దక్కింది.రాబోయే ఎన్నికల సమయానికల్లా తొట్టంబేడు మండలంలో దాదాపు 15 వేల ఎకరాలకు రెండో పంట పండించుకునేందుకు నీరు ఇచ్చి తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని అన్నారు.అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు కుటుంబాలే కాంట్రాక్ట్ వర్క్ చేసేవారు కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్సీలు 35% ఎస్టీలు 4% అలాగే బీసీలు 42% కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు.అలాగే మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీకు సేవ చేయడం కోసం నేను నా బిడ్డ ఇద్దరూ ఉన్నాము మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా మాకు తెలియజేయండి.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే మండల స్థాయి అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About The Author