నివర్ తుఫాన్” సహాయక చర్యలో అద్బుత ప్రతిభ వారి కుటుంబంలో ఆనందాన్ని నింపిన తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు

నివర్ తుఫాన్” సహాయక చర్యలో అద్బుత ప్రతిభ వారి కుటుంబంలో ఆనందాన్ని నింపిన తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు.

నివర్, తుఫాన్, సహాయక చర్యలో అద్బుత ప్రతిభ కనుబరిచి ఇద్దరి ప్రాణాలను కాపాడి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపిన తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు. తిరుపతి అర్బన్ జిల్లా రేణిగుంట మండలం, కుమ్మరి పల్లి గ్రామంలో నివాసం ఉండు రైతులు రమేష్, వెంకటేష్, ప్రసాద్ అను వారు “నివర్ తుఫాన్” ఉధృతి దృష్ట్యా తన పొలానికి సంబందించిన మోటార్ స్టాటర్లను భద్ర పరిచే నిమిత్తం రాళ్ళ కాలవ పల్లి వాగు యందు గల స్టాటర్లను తీసి భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటలకు తమ స్టాటర్లను తీస్తున్న సమయంలో అనుకోని విదంగా ఉన్నట్లుండి ప్రవాహం ఉధృతి అధికమైంది. వెంటనే ప్రమాదాన్ని గమనించిన వారు పోలీస్ రేణిగుంట అర్బన్ సి.ఐ శ్రీమతి అంజు యాదవ్ గారికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సి.ఐ గారు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను చేపట్టారు. అదే సమయంలో తన ఉన్నత అధికారులకు సమాచారాన్ని చేరవేసి పరిస్థితి యొక్క తీవ్రతను తెలియపరిచారు.అప్పటికే నివర్ తుఫాన్ ప్రమాదపు హెచ్చరికలు ఉన్న ప్రాంతాలను పర్యటిస్తున్న జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ వారు పరిస్థితిని అవగాహన చేసుకొని స్థానిక రెవిన్యూ అధికారులతో మరియు జిల్లా అగ్నిమాపక దళ అధికారులతో సంప్రదించి తక్షణం సహాయ చర్యలను చేపట్టాలని తెలియపరిచారు. సమయం పెరిగే కొద్ది వాగు యొక్క ప్రవాహపు ఉధృతి అధికమౌతుండడంతో అపాయాన్ని గ్రహించి సంఘటన స్థలంలో ఉన్న జిల్లా యస్.పి గారు జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించి హెలికాప్టర్ సహాయంతో కాపాడాలనే ప్రయత్నం చేయగా ప్రతికూల వాతావరణం వలన హెలికాప్టర్ రాలేకపోయింది. తదుపరి చర్య నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ విభాగాన్ని సంప్రదించి చిత్తూరులో ఉన్న స్పీడ్ బోట్ వెంటనే సంఘటనా స్థలానికి త్వరితగతిన వచ్చే విదంగా ఏర్పాట్లు చేసి అగ్నిమాపక శాఖ వారు మరియు స్థానిక పోలీస్ ఇరువరు కలసి వాగులో చిక్కుకున్న వెంకటేష్ వయసు 21 సం.”, రమేష్ వయసు 21 సం.” లను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేరవేసి తిరిగి  ప్రసాద్ వయసు 30 సం” ఇతని ఆచూకి కోసం స్థానిక పోలీస్ వారు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వారు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతుండగా సత్యవేడు నుంచి వచ్చిన యన్.డి.ఆర్.యఫ్ బృంద కూడా గాలింపు చర్యలలో పాల్గొనచున్నదని జిల్లా యస్.పి గారు తెలియజేసారు.ఈ సహాయక చర్యల్లో జే.సి2 వీర బ్రహ్మం గారు, ఆర్.డి.ఓ కనకా నరసా రెడ్డి గారు, రేణిగుంట డి.యస్.పి రామచంద్రా గారు, సి.ఐ అంజు యాదవ్, ఫైర్ ఉన్నతాధికారులు వి.ఆదినారాయణ రెడ్డి, రెవిన్యూ అధికారులు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author