శభాష్ చెవిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ గారు,అభినందన

శభాష్ చెవిరెడ్డి

ప్రమాదమని తెలిసీ తెగువ చేసిన ఎమ్మెల్యే

రెస్క్యూ సిబ్బందితో కలసి నేరుగా సహాయక చర్యల్లో ..

వాగులోంచి రైతులను ఒడ్డుకు చేర్చే వరకూ

చెవిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అభినందన 

ఎవరైనా ఆపదలో ఉన్నారని చెవిరెడ్డి నోటీసుకు వస్తే చాలు. ఎమ్మెల్యే చెవిరెడ్డి అరనిమిషం కూడా ఆలస్యం చేయరు. రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసే వరకూ ఆయన నిద్రపోరు. అది ఆయన నైజం. నిన్నటి కరోనా కష్టమైన నేటి వరద సాయమైనా ఆయన తీరును చూసిన జనం ఔరా… ! చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనక మానరు. 

సరిగ్గా ఇలాంటి సంఘటనే గురువారం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో సంభవించింది. ఏర్పేడు మండలానికి చెందిన ముగ్గురు రైతులు పొలాలకు నీళ్ళు పెట్టేందుకు వెళ్ళారు. అయితే నివర్ తుఫాను కారణంగా విపరీతమైన వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో నీరు చేరిపోయింది. రైతులు తిరుగు ముఖం పట్టారు. మార్గమధ్యంలో రాగుళ్ళ వాగుకు నీటి ఉధృతి పెరగడంతో ఆ రైతులు వరదలో చిక్కుకుపోయారు. చెట్లను పట్టుకుని అక్కడే ఉండిపోయారు. నీరు అంతకంతకు పెరిగిపోసాగింది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెవిరెడ్డికి సమాచారం చేరింది. విషయం తెలిసిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను సమన్వయం చేశారు.

మరోవైపు తాను సంఘటనా స్థలానికి పరుగులుదీశారు. హెలికాఫ్టర్ ఇక్కడికి చేరుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వీలుపడలేదు. దీంతో చెవిరెడ్డి స్థానిక ఫైర్ మరియు ఇతర సిబ్బంధిని కూడేశారు. చెవిరెడ్డి సమీపంలో ఉన్న స్పీడ్ బోటును తెప్పించేశారు.

మరోవైపు నీటి ఉధృతి పెరిగిపోతోంది. వరద నీటిని కూడా లెక్క చేయకుండా అందరూ వారిస్తున్నా కూడా వినకుండా తానే ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో దిగారు. లైఫ్ జాకెట్ ధరించి సిబ్బందితోపాటు తాను కూడా బోటు ఎక్కి వాగులో చిక్కుకున్న రైతుల రక్షణ చర్యల్లో పాలుపంచుకున్నారు. రైతులను బోటు ద్వారా ఒడ్డుకు చేర్చారు. రైతులకు తానే స్వయంగా నీరు తాపించి వారిని సముదాయించారు.

ధై్ర్యం చెప్పారు. తమ కుటుంబ సభ్యులను కాపాడడానికి ఆయన చూపిన తెగువకు రైతుల కుటుంబాల సభ్యులు చెవిరెడ్డికి కృతజ్నతాపూర్వకంగా పాదాభివందనం చేశారు.  ప్రజాప్రతినిధి అంటే తెల్లదుస్తులు వేసుకుని రాజకీయాలు చేయడం ఒకటే కాదు. అవసరమనుకుంటే, నేరుగా రంగంలో దిగి బాధితులను కాపాడడానికి కూడా వెనుకాడనని చెవిరెడ్డి మరోమారు నిరూపించారు. ఆయన తెగువను, సేవానిరతిని అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అయితే మరొక్క రైతు మాత్రం కాలికి వేర్లు తగులుకుని ఇరుక్కుపోవడంతో వరదల్లో గల్లంతయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతనిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అతని కోసం ఎన్డీయారెఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 

చెవిరెడ్డికి సిఎం అభినందన

ఎవరి కోసం ఎదురు చూడకుండా సమాచారం అందిన వెంటనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాగులో వరదల్లో చిక్కకున్న రైతులను సకాలంలో కాపాడడానికి చూపిన తెగువ, సమన్వయానికి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినదించారు. ఇక అదే విధంగా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు చెవిరెడ్డి చూపిన చొరవను ధైర్యాన్ని మెచ్చుకుని అభినందించారు

About The Author