టీకా ఇచ్చాక అర గంట పాటు పర్యవేక్షణ…
*_?వ్యాక్సిన్ గదిలోకి ఒక్కొక్కరికే ప్రవేశం_*
*_?ముందుగా నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్య క్రమంలో అవకాశం_*
*_?మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం_*
*?దిల్లీ: కొవిడ్-19 టీకాలు వేసే సమయంలో రద్దీ లేకుండా చూడాలని కేంద్రం స్పష్టంచేసింది. సదరు గదిలోకి ఒకసారి ఒక లబ్ధిదారును మాత్రమే అనుమతించాలని స్పష్టంచేసింది. టీకా ఇచ్చాక అతడిని అరగంట పాటు పర్యవేక్షించాలని పేర్కొంది. ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయా అన్నది పరిశీలించాలని నిర్దేశించింది. విస్తృత స్థాయిలో టీకాలు వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ అంశంపై జారీ చేసిన సవివర మార్గదర్శకాల్లో ఈ అంశాలను పొందుపరిచింది. వీటి ప్రకారం..*
*♦️ టీకా లబ్ధిదారులు తొలుత ‘కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్’ (కో-విన్) అనే డిజిటల్ వేదికలో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పెన్షన్ పత్రం వంటి 12 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగించుకోవచ్చు.*
* ♦️వ్యాక్సిన్ కేంద్రంలోకి ముందుగా నమోదు చేసుకున్న లబ్ధిదారులను మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ప్రాధాన్య క్రమంలో జరుగుతుంది. అక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కుదరదు.*
* ♦️నమోదు చేసుకున్న లబ్ధిదారులు, కరోనా టీకా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కూడా ప్రభుత్వం కో-విన్ వేదికను ఉపయోగిస్తుంది.*
*♦️ సాధ్యమైనంత వరకూ ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను కేటాయించేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో భిన్న టీకాలు కలిసిపోయే పరిస్థితి ఉండదు.*
*♦️ వ్యాక్సిన్లను భద్రపరిచే పెట్టెలు, వయల్స్, ఐస్ ప్యాక్‌కు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.*
* ♦️టీకాలు, డైల్యూటెంట్లను వ్యాక్సిన్ పెట్టెల్లో ఉంచాలి. టీకా కేంద్రంలోకి లబ్ధిదారు వచ్చేవరకూ దాని మూతను బిగించే ఉంచాలి.*
* ♦️వ్యాక్సిన్ల భద్రతా స్థాయిని సూచించే ‘వ్యాక్సిన్ వయల్ మోనిటర్’ (వీవీఎం), గడువు కాలం వంటివి ఆ టీకాల లేబుళ్లపై ఉండకపోవచ్చు. అంతమాత్రాన వాటిని పక్కన పెట్టేయకూడదు.*
*♦️ టీకా బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఒక కేంద్రంలో రోజుకు వంద మంది లబ్ధిదారులకు మాత్రమే టీకా వేసేలా సెషన్లను ఖరారు చేయాలి. సదరు కేంద్రంలో సరిపడా మౌలిక వసతులు, వెయిటింగ్ రూమ్, పరిశీలన గది, రద్దీ నిర్వహణకు సౌకర్యాలు ఉంటే మరో వ్యాక్సినేటర్ అధికారిని నియమించి, ఒక్కో సెషన్‌లో 200 మంది లబ్ధిదారులకు టీకాలు వేయవచ్చు.*
* ♦️ఒక్కో సెషన్ ముగిశాక ఐస్ ప్యాక్‌లతో కూడిన టీకా పెట్టెను, మూత తెరవని టీకా వయల్స్‌ను శీతల కేంద్రానికి పంపాలి.*
*♦️ టీకాలను వినియోగంలోకి తీసుకురావడంలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి విస్తృత కమ్యూనికేషన్లు, సామాజిక సమీకరణ వ్యూహాలను రాష్ట్రాలు అమలు చేయాలి.*
*♦️ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కొన్ని సవాళ్లను నిర్దిష్ట సమయంలోగా అధిగమించాలి. దేశ ప్రజలందరికీ టీకా కార్యక్రమంలో పురోగతి, వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలపై వాస్తవ సమాచారాన్ని సకాలంలో అందించాలి. వ్యాక్సిన్లు ఇవ్వడంలో ప్రాధాన్య విధానాన్ని పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తలెత్తే ఆందోళనలు, సందేహాలను తీర్చాలి. టీకాలపై స్వల్పస్థాయి ప్రయోగాలే చేశారని, వాటివల్ల దుష్ప్రభావాలు తలెత్తవచ్చన్న ఆందోళనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తలపై తగు రీతిలో స్పందించాలి.*
*♦️ కొవిడ్ టీకాను తొలుత ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడినవారికి ఇస్తారు. ప్రాధాన్యక్రమంలో ఆ తర్వాత.. ఆరోగ్య సమస్యలు ఉన్న 50 ఏళ్ల లోపువారికి వేస్తారు. ఆ తర్వాత మహమ్మారి తీరుతెన్నులు, టీకా లభ్యతను బట్టి మిగతా జనాభాకు వ్యాక్సిన్ ఇస్తారు.*
*♦️ 50 ఏళ్లు పైబడిన వారిని.. 60 ఏళ్లు పైబడినవారు, 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు అనే రెండు వర్గాలుగా విభజిస్తారు.*
* ♦️50 ఏళ్లు పైబడిన వారిని గుర్తించడానికి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితాను ఉపయోగించాలి.*
*_?వైద్య సిబ్బందికి టీకా సూచనలు_*
*?టీకా వేసే సమయంలో తలెత్తే వ్యర్థాలు సమాజానికి, పర్యావరణానికి ప్రమాదం కాబట్టి వైద్య సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా సూది వేయాలని పేర్కొంది.*
*♦️ టీకా వేయడానికి ముందు, వేసిన తర్వాత వైద్యసిబ్బంది కనీసం 70% ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్‌తో కానీ, సబ్బుతో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలి.*
*♦️ సిబ్బంది శరీరంపై గాయాలు, గాట్లు ఉంటే వాటిని కప్పి ఉంచాలి.*
*♦️ శరీరం రంగు మారిన చోట, కోతలు, చర్మ సమస్యలున్న చోట సూది గుచ్చకూడదు.*
* ♦️ప్రతిసారీ పూర్తిగా శుభ్రం చేసిన కొత్త ‘ఆటో డిసేబుల్ సిరంజీ’నే ఉపయోగించాలి. ప్యాకింగ్ దెబ్బతిన్న, కాలం చెల్లిన సిరింజీలను ఉపయోగించకూడదు.*
*♦️ సిరంజీల్లో ముందుగానే టీకాను నింపొద్దు. టీకా వేశాక సూదికి క్యాప్ పెట్టడానికి ప్రయత్నించొద్దు. దీనివల్ల ఒక్కోసారి చేతికి సూది గుచ్చుకొనే అవకాశం ఉంటుంది.*
*♦️ లబ్ధిదారునికి ఇంజెక్షన్ వేసిన వెంటనే హబ్ కట్టర్‌ను ఉపయోగించి సిరంజీని ధ్వంసం చేయాలి. ప్లాస్టిక్ పైభాగాన ఉన్న భాగాన్ని ముక్కలుచేసి, ఎర్ర సంచిలో వేయాలి. వ్యాక్సిన్ వేశాక సూదులను బల్లలపై ఉంచకూడదు.*
*♦️ టీకా వేశాక ఉపయోగించే దూదిని పసుపు రంగు సంచిలో భద్రపరచాలి.*
*♦️ వ్యాక్సిన్ సమయంలో తలెత్తే వ్యర్థాలన్నింటినీ పోగుచేసి సమీపంలోని పీహెచ్‌సీకి అందించి, జాగ్రత్తగా ధ్వంసం చేసేలా చర్యలు తీసుకోవాలి.*
* ♦️హబ్‌కట్టర్లను ఉపయోగించే ముందు వాటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. పగిలిపోయిన, దెబ్బతిన్న టీకా వయల్స్‌ని నీలం రంగు కంటెయినర్లలో నిల్వచేయాలి.*