సోము ను బిజెపి అందుకే నియమించిందా !


పూటకో మాట, ప్రాంతానికో ప్రకటన సిగ్గు అనిపించటం లేదా !

మీడియాను తొక్కి పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మీకు ప్రజలే గుణపాఠం చెప్పాలి.

గోదావరి జిల్లాల సమస్యలు సోముకు కనిపించటంలేదా !
————-
మేడా శ్రీనివాస్,
ఎద్దేవా చేసారు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
————-
బిజెపి (మోది)పార్టి తెలంగాణా కు
“బండి” ని, నియమించి ఏపికి సోమును నియమించటం వెనుక ఆంతర్యం ఇదేనా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసారు.

అమరావతిలో రైతు ల ఆందోళన శిబిరాలను సందర్శించిన సమయంలో సోము వీర్రాజు ఏపికి రాజధాని అమరావతే అంటు ప్రకటన చేసి చప్పట్లు కొట్టించుకున్న సోము కర్నూల్, మంత్రాలయం లో మాట్లాడుతూ సీమకు అన్యాయం జరిగింది, హై కోర్టు కర్నూల్ లో పెడతాం, అసెంబ్లీ సమావేశం కర్నూల్ లో జరిపిస్తాం అనే మాటలు ఎవరిని మోసం చేయటానికో చెప్పే దమ్ము సోముకు వుందా అని ఆయన ప్రశ్నించారు.

నేరుగా బిజెపి (మోది )పార్టి మూడు రాజధానుల అంశం ఏపి సర్కార్ ఇష్టం మేరకే జరుగుతుంది అని చెబుతూ న్యాయస్థానం లో అఫిడవిట్ సైతం దాఖలు చేసారని, గత కొన్ని నెలలుగా ఏపిలో రాజధాని అంశం పైన, అసెంబ్లీ, సచివాలయం ,
హై కోర్టు సందిగ్ధం పైన అగ్గి రాజుకుంటుంటే దద్దమ్మ ప్రకటనలతో ఏపి బిజెపి కాలయాపన రాజకీయాలుతో
ఏపి ని మోసగించే ప్రయత్నాలు చేయటం హేయంగా అనిపించటం లేదా ! అని ఆయన మండిపడ్డారు .

అమరావతి రైతులు కూడా మోసపోవటానికి మేము సిద్ధం అన్నట్టుగా చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్కళ్యాణ్ ఎవరొచ్చినా స్వాగతిస్తు హారతులు పట్టి రాజధాని ఉద్యమాన్ని బలహీన పరుస్తున్నట్టుగా వుందని, సెక్రిటరియేట్,
హై కోర్టు, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు వుంటేనే అది పక్కా రాజధాని అవుతుంది అనే కనీస జ్ఞానం లేకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని, దశాబ్దాలుగా అన్యాయాయనికి గురైతున్నాయని సన్నాయి రాజకీయ ఉపన్యాసాలతో నేటి నేతలు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన వాపోయారు .

నిజానికి రాయలసీమ, ఉత్తారాంధ్రా ప్రాంతాలనుండి ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులు అందరు ఆ ప్రాంతాల అభివృద్ధి ని దోచుకుంటు
ఆ ప్రాంతాలకు నేటి వరకు అన్యాయం చేస్తూనే వున్నారని, అక్కడ వున్న అనేక సహజ వనరులను దోచుకుంటు అభివృద్ధి కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు చెబుతున్నట్టుగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.

గోదావరి జిల్లాల నుండి ఎన్నికైన నేతలు నేటి వరకు మా జిల్లాకు
ఈ అభివృద్ధి కావలి అని అడిగిన ఏ ఒక్క నేత వుండరని, ఎక్కువ సమయం అంతా చతుర్ముఖ పారాయణానికే ఎక్కువ సమయం కేటాయిస్తు గోదావరి జిల్లాల అభివృద్ధి గాలికి వదిలి ఎన్నికలకు 3 నెలల ముందు నిద్ర లేస్తుంటారని, అపార ఖనిజ సంపదలు గల గోదావరి జిల్లాలు నేతల బానిస మత్తుకు బలైపోతున్నాయని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.

ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలలో ప్రధాన మైన ప్రత్యేక హోదా తరగతి, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, రాజమండ్రి సాంస్కృతిక కళ క్షేత్రం, రామాయపట్నం మేజర్ పోర్ట్, కడప ఉక్కు ప్యాక్టరీ పైన గాని, శ్రీకాకుళం, రాజమండ్రి, కర్నూల్ లో హై కోర్టు బెంచ్ కోసంగాని , రాజమండ్రి లో రైల్వే విడిభాగాల పరిశ్రమ, గోదావరి జిల్లాలలో పర్యాటక అభివృద్ధి, విశాఖపట్నం లో ప్రధాన అభివృద్ధి, విశాఖపట్నం లో డివిజన్ తో కూడిన రైల్వే జోన్, కాలుష్యరహిత త్రాగునీరు కావలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సోము ప్రశ్నించకుండా ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

ఎంతో చారిత్రిక ప్రాధాన్యత గల మీడియా రంగం పై రాజకీయ వేధింపులు చేస్తు మీడియా ఆత్మవిశ్వాసాన్ని నేటి పాలకులు దెబ్బతీస్తున్నారని, మీడియాను నేటి ప్రభుత్వాలు సమాన స్థాయిలో ప్రోత్సహించకుండా భజన చేసే మీడియాకు మాత్రమే ప్రత్యేక రాయితీలతో అండగా నిలుస్తు మీడియా ఐఖ్యతను కలుషితం చేస్తు వారిలో వారికి వివాదాలు సృష్టిసున్నారని, కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రజలను దోచుకునున్నవారికి, అభివృద్ధి ని స్వప్రయోజనాలకు దారి మళ్లించుకుంటున్న
వారికి , రాజకీయాన్ని ఖరీదైన వ్యాపారంగా మార్చేసిన వారికి, మీడియా పై పెత్తనం చేస్తున్నవారికి, రాజకీయ భావాలకు, సిద్ధాంతాలకు కనీస అర్హత లేని సినీమాయ గాళ్ళకు అధిక ప్రాధాన్యతనిస్తు ప్రజా వ్యవస్థ బ్రష్టు పట్టడానికి కారకులైతున్నారని,
అక్షరాన్ని నమ్ముకున్న జర్నలిస్ట్ బిడ్డలను చదివించుకోవటమే భారమైతుందని, కొన్ని ప్రధాన మీడియా వారు ఆస్తులు కాపాడుకోవటానికి, చిన్న మీడియా వారు వేధింపులు తట్టుకోలేక అక్షరాన్ని నమ్ముకోలేక పోతున్నారని, నేడు కొన్ని మీడియా సంస్థలు డ్రాయర్లు, బనియన్లు వేసుకుతిరిగే వారికిచ్చే ప్రాధాన్యత గుడ్డ కప్పుకునే వారికి ఇవ్వలేక పోతున్నారని ఆయన ఆవేదన చెందారు.

బిజెపి (మోది )పార్టికి ఆంధ్రప్రదేశ్ పై గల ద్వేషం కనబడుతుందని, తెలంగాణా బిజెపి శాఖ కు కేసీఆర్ అరాచకాలపై విరుచుకు పడే లాంటి బండి సంజయ్ ను ఎంపికచేసి, ఆంధ్రప్రదేశ్ కు జగన్ కు భజన చేస్తు బిజెపి ఎదుగుదల కన్నా బిజెపి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంచగలిగే సోమును ఎంపిక చేసినప్పుడే బిజెపి కేంద్ర అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ పై గల అక్కసు బాహాటంగా కనబడుతుందని ఆయన ఆరోపించారు.

బలహీనతలకు తావులేని ఉద్యమ నిర్మాణం కొనసాగితేనే ఏపి అభివృద్ధి ముందంజ లో వుంటుందని, ఇవే పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే మరో 50 ఏళ్ళు దాటినా ఏపి కి భవిష్యత్తు వుండదని,ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల అభివృద్దె ప్రధాన లక్ష్యంగా భావించాలని, నేటి కలుషిత రాజకీయ పరిస్థితుల్లో మీడియా పాత్ర స్వచ్చందంగా పోషించలేకపోతున్నారని నేటి తరం గ్రహించి ఆ నాటి జై ఆంధ్రా ఉద్యమ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా కాపాడుకోవాలని, అందుకు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ నిర్మాణ పోరాటానికి సిద్ధపడాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఈ సభకు అర్పిసి సీనియర్ నాయకులు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,లంక దుర్గా ప్రసాద్, దుడ్డె త్రినాధ్, సిమ్మా దుర్గారావు, వల్లి శ్రీనివాసరావు, మోర్తా ప్రభాకర్, దొంగా బాలాజీ, దుడ్డె సురేష్, దోషి నిశాంత్, ఇళ్ల రాము, వర్ధనపు శరత్ కుమార్, కొల్లిపల్లి లక్ష్మణ్, కొల్లిపల్లి అనంతలక్ష్మి, యనుమల సోని, మాసా అప్పాయమ్మ, నాగురి అన్నపూర్ణ, నాగురి సింహాచలం, ఎన్ బాబీ, ఎన్ దుర్గ, లంక శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొనియున్నారు.

–మేడా శ్రీనివాస్, MA, LLM, MA(Jour),
అధ్యక్షులు : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.

About The Author