ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యాచారం..


ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యాచారం ఘటనపై బిజెపి మహిళా నాయకురాళ్లు

అనంతపురం జిల్లా బిజెపి కార్యాలయంలో మహిళా నాయకురాళ్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు మరియు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని కనీస భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు

సీనియర్ నాయకురాలు ఆదిలక్ష్మమ్మ గారు మాట్లాడుతూ నల్లమాడ గ్రామంలో మైనర్ బాలికపై ఒక లారీ డ్రైవర్ అత్యాచారం చేయడం చాలా ఘోరమైన సంఘటన అని ఆ దుర్మార్గుడి కారణంగా ఈ రోజు ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడని ముఖ్యమంత్రి గారు ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నా కనీసం స్పందించరు కులాల కొట్లాట లో మతాల దౌర్జన్యాల లో రాష్ట్రం దౌర్భాగ్య స్థితికి వెళ్తుంటే మహిళలకు రక్షణ లేక పట్టించుకునేవారు లేక వాళ్ళందరూ రాక్షనో రామచంద్ర అనే దుస్థితిలో ఉందని అన్నారు.
రూపా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఒక దళిత యువతిని పాక్షికంగా అత్యాచారం పట్టించుకునే నాథుడు లేడని ఆయన సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణాలు జరుగుతున్నాయి అని వయసుకు నిమిత్తం లేకుండా ఆడవారిని హింసకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

మరొక నాయకురాలు చిన్నీ రంగమ్మ గారు మాట్లాడుతూ గుంటూరులో బాలికను ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్యకు పురి గొలిపేలా చేసిన దుర్మార్గున్ని శిక్షించాలని, జిల్లా వ్యాప్తంగా మహిళల కోసం ఒక కార్యాచరణ సిద్ధం చేశామని అది మరీ మీడియా వారికి తెలియజేస్తామని తెలిపారు.

About The Author