ప‌్రైవేట్ స్కూల్స్‌కు హైకోర్టు ఆదేశం…


హైదరాబాద్: స్కూళ్లు తెరిచాక ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ప్రైవేటు విద్యాసంస్థలకు సూచించింది హైకోర్టు. అకాడమిక్ ఇయర్, బుక్స్, లైబ్రరీ, ట్రాన్స్ పోర్టు లను వసూలు చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్స్‌లో ఆన్ లైన్ క్లాసులు అధిక ఫీజుల‌పై హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్ ను హైకోర్టు శుక్రవారం విచారణ చేసింది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరేంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. ప్రైవేటు విద్యాసంస్థలు.. ఫీజులపై జీవో 46ను పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జీవో 46 ప్రకారం స్కూల్ ఫీజు మాత్రమే తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. దీంతో.. ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు విద్యాసంస్థలు పాటించాల్సిందేనని కోర్టు తెలిపింది. పాఠశాలలు తెరిచాక ఇతర ఫీజులు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

About The Author